MMN Parasurama Raju
07/11/2025
ఈరోజు 07-11-2025 శుక్రవారం ఉదయం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతానికి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సంపూర్ణ వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించారు.
బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి M నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ A కేశవకాంత్, బీజేపీ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి N విజయానంద రెడ్డి, జిల్లా పదాధికారులు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
05/11/2025
రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
ఈ పర్వదినం అందరి జీవితాల్లో వెలుగులు, ఆనందం, శాంతి మరియు సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను..
పరమశివుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, ఉజ్వల భవిష్యత్తు వైపు మార్గనిర్దేశం చేయాలని ప్రార్థిస్తున్నాను.
03/11/2025
ఈరోజు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం గ్రామంలో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (NCL Industries Limited) వారి అత్యాధునిక కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్ ను కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు తో కలిసి పాల్గొన్న బిజెపి విశాఖ జిల్లా అధ్యక్షులు పరుశురామ రాజు గారు.
02/11/2025
పలాస _ కాశీబుగ్గ లో నిన్న ఏకాదశి నాడు దేవుని దర్శనానికి వెళ్ళిన సందర్భంలో జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయినటువంటి వారికి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు మనోస్డైరాన్ని ఇవ్వాలని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నేడు సంఘటన స్థలాన్ని మరియు క్షతగాత్రులను పరిశీలించి పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమం లో *భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మరియు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు,ఎచ్చెర్ల ఎమ్మెల్యే శ్రీ ఎన్.ఈశ్వరరావు, వైజాగ్ & శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు & తేజేశ్వరరావు గారు* నాయకులతో పాటు కలిసి పరిశీలించడం జరిగింది.
31/10/2025
ఈరోజు 31-10-2025 శుక్రవారం బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారి ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి 150 వ జయంతి సందర్భంగా వాల్తేర్ క్లబ్ ఎదురుగా ఉన్న సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా MMN పరశు రామ రాజు మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయే వ్యక్తి అని కొనియాడారు. సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు తన చాణక్య నీతితో 562 సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని ఒకటిగా చేసారు అన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం రావడమనేది ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితం అని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మౌలానా ఆజాద్ లాంటి అమరవీరులు త్యాగ ఫలాన్ని చిన్నదిగా చూపించి, స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన ప్రభుత్వాలు ఒక కుటుంబాన్ని మాత్రమే ప్రచారం చేస్తూ దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలు అన్నిటికి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల పేర్లను మాత్రమే పెట్టడం జరిగిందని అన్నారు. ఈ సంప్రదాయాన్ని సరిదిద్దే క్రమంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే గాంధీజీ జన్మదినమైన అక్టోబర్ 2 ను స్వచ్ఛత దివస్ గాను, దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదినమైన సెప్టెంబర్ 25 ను అంత్యోదయ దివస్ గాను, సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జన్మదినమైన అక్టోబర్ 31 ను రాష్ట్రీయ ఐక్యత దివస్ గాను పాటిస్తూ ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్ధార్ వల్లభ్ భాయ్ గారి 182 మీటర్ల ఎత్తైన భవ్య విగ్రహాన్ని నిర్మించి, ఆ విగ్రహాన్ని ప్రధాన మంత్రి గారు స్వయంగా ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అక్టోబర్ 31 వ తేదీన సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుతుందని అన్నారు.
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారని, భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించి, రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించారు అని తెలిపారు. అనేక సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయడానికి కృషి చేసి అందుకు సహకరించని వారి మీద మిలటరీ చర్యలకు కూడా వెనుకాడకుండా ఈనాటి భౌగోళిక భారత దేశం ఏర్పడటానికి ముఖ్య కారకులయ్యారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి M నాగేంద్ర, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి SVS ప్రకాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ KNP చక్రవర్తి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు D కృష్ణంరాజు, తలాడ గిరిజ, బీజేపీ జిల్లా కార్యదర్శి లెంక శ్రీరామ్, కారుభుక్త పద్మ, T భారతి,మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొని సర్దార్ వల్లభ్ భాయ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
25/10/2025
24-10-25 విశాఖపట్నం బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు సమావేశం నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు పరుశురామ రాజు గారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నియోజకవర్గగల వారీగా మండల అధ్యక్షులతో పార్టీ సంస్థాగత నిర్మాణం, రానున్న రోజుల్లో చేయవలసిన కార్యక్రమాలు గురించి దిశా నిర్దేశం చేయడం జరిగింది.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Seethammadhara
Visakhapatnam
530013