Krishna District Development FORUM
బెజవాడ అంటే ఇది....
భండారు శ్రీనివాసరావు అనే సీనియర్ పాత్రికేయులు కొన్ని సంవత్సరాల క్రితం రాసింది... మీరు చూసిన, విన్న బెజవాడ మారిపోయి చాలా కాలం అయిపొయింది... మీకు తెలిసిన బెజవాడ చాలా తక్కువ, ఇదిగో భండారు శ్రీనివాసరావు గారు రాసింది చూడండి...బెజవాడ అంతే ఇది... "రెండు కులాల మద్య కక్షలు కార్పణ్యాలు, ఆ కులాలకు ప్రతినిధులని చెప్పుకొనే వ్యక్తుల మధ్య రగిలే పగలు, సెగలు ఇవాళ బెజవాడ అంటే. బహుశా దాన్ని విజయవాడ అనాలేమో. బెజవాడ కాదేమో... నాకు తెలిసిన బెజవాడ, సినిమాలో చూపించిన బెజవాడ మాత్రం కాదు. నా బెజవాడ హుందాతో కూడిన రాజకీయాలకు నెలవు. సంగీత సాహిత్యాలకి కాణాచి. చైతన్యానికి, దాతృత్వానికి, సేవాభావాలకు మారు పేరు. అయ్యదేవర కాళేశ్వరరావు, అచ్చమాంబ, కే.ఎల్.రావు, టి.వి.ఎస్. చలపతి రావు, డాక్టర్ దక్షిణా మూర్తి, మరుపిళ్ళచిట్టి, కాకాని వెంకట రత్నం, కాకరపర్తి భావన్నారాయణ, ఖుద్దూస్, ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో ఆణి ముత్యాలు.. బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు. సంగీతంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ, మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీ కాంత రావు, వోలేటి వెంకటేశ్వర్లు, మహాదేవ రాధాకృష్ణం రాజు, కంభంపాటి అక్కాజీ రావు, శ్రీరంగం గోపాల రత్నం బెజవాడకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. సాహిత్యంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పేరాల భరత శర్మ, చెరుకుపల్లి జమదగ్ని శర్మ వంటి కవి పండిత శ్రేష్ఠులు, పరిశ్రమలతో పాటు ధార్మిక సంస్థలు నెలకొల్పిన చుండూరు వెంకటరెడ్డి, కౌతా పూర్ణానందం, మాగంటి సూర్యనారాయణ, జీ.ఎస్. రాజు, సినీ రంగం ప్రముఖులు పోతిన శ్రీనివాసరావు, పూర్ణ మంగరాజు కామరాజు, విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు, నవయుగ శ్రీనివాసరావు, కాట్రగడ్డ నరసయ్య, తెలుగు సినిమా హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన జంధ్యాల - బెజవాడ అనగానే చటుక్కున గుర్తుకు రావాల్సిన వాళ్లు వీళ్ళు.
ఉన్నదంతా దానధర్మాలు చేసిన తుమ్మలపల్లి వారు, తంగిరాల వీరరాఘవయ్య , చోడవరపు దేవల్రాజు, జనాలకు చదువు నేర్పడం కోసం ఊరూరా లైబ్రరీలు పెట్టిన అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, మూఢనమ్మకాలను ఎదిరించిన గోరా, నాటకాల్లో ఎప్పటికీ మరుపురాని అద్దంకి శ్రీరామమూర్తి, విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప, బి.వి. రంగారావు, సూరవరపు వెంకటేశ్వర్లు, సూరిబాబు- రాజేశ్వరి, కర్నాటి లక్ష్మినరసయ్య, సీడీ కృష్ణమూర్తి, నాటకాలు ఆడించిన జైహింద్ సుబ్బయ్య, వస్తాదులకే వస్తాదు దండమూడి రామ్మోహన్ రావు, ప్లీడర్లు కొండపల్లి రామచంద్ర రావు, చింతలపాటి శివరామకృష్ణ, ముసునూరి వెంకటరామ శాస్త్రి, చక్రవర్తి, పాటిబండ సుందరరావు, ఇటీవలే తన 94 ఏట కన్నుమూసిన తుర్లపాటి హనుమంత రావు, పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు, నీలంరాజు వెంకట శేషయ్య, పండితారాధ్యుల నాగేశ్వర రావు, కే.ఎల్.ఎన్. ప్రసాద్, నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రమణ్య శర్మ, కాట్రగడ్డ రాజగోపాలరావు, బొమ్మారెడ్డి, ఏబీకె ప్రసాద్, పీ.ఎస్. ప్రకాశరావు, అయిదుగురు ముఖ్యమంత్రులకు పీ.ఆర్.వో. గా పనిచేసిన భండారు పర్వతాలరావు, అయ్యదేవర కాళేశ్వరరావు ,తమ్మినాపోతురాజు ,మరుపిళ్ల చిట్టి ,కే ల్ రావు ,హరిద్రనాద్ చటోపాధ్యా విజయవాడ నుండి మొదటి పార్లమెంట్ సభ్యులు ,చండ్రరాజేశ్వరరావు ,పుచ్చలపల్లి సుందరయ్య ,అచ్చమాంబ ,టి వీ స్ చలపతిరావు - వీరిదీ బెజవాడ. బెజవాడ అంటే ఇలాటి వాళ్ళే! ప్రభాకర ఉమామహేశ్వర పండితుల ధార్మికోపన్యాసాలు, వేలాదిమందికి వారు నేర్పిన సూర్య నమస్కారాలు, లబ్ధ ప్రతిష్టులయిన రచయితలు తెన్నేటి లత, కొమ్మూరి వేణుగోపాలరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గొల్లపూడి మారుతీ రావు, నవోదయ బుక్ హౌసులో సాహిత్య సమావేశాలు, నిమ్మగడ్డ వారి ఎంవీకేఆర్ పబ్లిసిటీస్, దక్షిణ భారత దేశంలో సినిమాలకన్నింటికీ వాల్ పోస్టర్లు సప్లయి చేసే నేషనల్ లితో ప్రింటర్స్ బెజవాడకు లాండ్ మార్కులు. టూ టౌన్ లో శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి లక్ష్మీ జనరల్ స్టోర్స్, వన్ టౌన్ లో మాజేటి రామమోహనరావు బట్టల కొట్టు శ్రీ రామనవమి పందిళ్ళు, రామకోటి సప్తాహాలు, నవరాత్రుళ్ళు ఇలాటివి గుర్తుకు వస్తే అదీ బెజవాడ. తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్, తంగిరాల వీరరాఘవయ్య కళ్యాణ మండపం, డీ.ఎల్. నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్, కోగంటి గోపాల కృష్ణయ్య ప్రజా నాట్యమండలి, సామారంగం చౌక్, చల్లపల్లి బంగ్లా, బోడెమ్మ హోటల్, న్యూ ఇండియా హోటల్ సెంటర్, ఆ సెంటర్ లో జరిగే పబ్లిక్ మీటింగులు, అన్నపూర్ణమ్మ హాస్టల్, సత్యనారాయణపురం శివాజీ కేఫ్, అలంకార్ సెంటర్, మొగల్రాజపురం గాంధీ బొమ్మ సెంటర్, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, వీధి రాజయ్య మేడ, బందర్ రోడ్డు, పాత శివాలయం, కొత్త గుళ్ళు, జెండా పంజా బస్ స్టాఫ్, అక్కడ గుమిగూడే జనం ఇవీ బెజవాడ అంటే.
లీలా మహల్ పక్కన పిడత కింద పప్పు, ప్రొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు, ఏలూరు రోడ్డు సెంటర్ అజంతా హోటల్ లో ఇడ్లీ, సాంబార్, మోడర్న్ కేఫ్ లో మినప దోసె, దుర్గ కాఫీ హౌసులో మైసూరు బజ్జీ, రవీంద్రా కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీం, పుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా, ఏలూరు కాలువ పక్కన బందరు మిఠాయి దుకాణంలో దొరికే నల్ల హల్వా, రామచంద్రరావు హోటల్లో అరటి ఆకు భోజనం. మాచవరం పేరయ్య హోటల్ లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు, కౌతావారి శివాలయం పక్కన పాణీ కిల్లీ కొట్ట్లులో పచ్చకర్పూరం, జాజిపత్రితో చేసిన తాంబూలం, సీ.వీ.ఆర్. స్కూలు దగ్గర పళని విబూది, వొడికిన జంధ్యాలు అమ్మే షాపు, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి, రామమోహన ఆయుర్వేద వైద్య శాల, నందివాడ హనుమత్ సీతాపతి రావు హోమియో వైద్య శాల, సినిమా హాలా లేక శిల్ప కళా క్షేత్రమా అనిపించే దుర్గా కళా మందిరం , మారుతి సినిమా, జైహింద్ టాకీసు, లక్ష్మీ టాకీసు, ఎప్పుడూ హిందీ సినిమాలు ఆడే శేష్ మహల్, ఇంగ్లీష్ సినిమాలు మాత్రమె చూపించే లీలా మహల్, పాత సినిమాలు ఆడే ఈశ్వర మహల్- ఇవీ మాకు తెలిసిన బెజవాడ అంటే. రాఘవయ్య పార్క్, రామ్మోహన్ గ్రంథాలయం, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం, దివ్యజ్ఞాన సమాజం, అన్నదాన సమాజం, కాళేశ్వర రావు మార్కెట్, గాంధీ కొండ, పప్పుల మిల్లు, శరభయ్య గుళ్ళు, అరండల్ సత్రం, చెట్ల బజారు, గోరీల దొడ్డి, కృష్ణలంక పక్కన బిరబిరా పారే కృష్ణమ్మ, ప్రకాశం బరాజు, అందర్నీ చల్లగా చూసే దుర్గమ్మ, దుర్గ గుడిలో గోపికలతో సయ్యాటలాడే కృష్ణుడి బొమ్మలు, అద్దాల మేడ, గుణదల కొండమీద మేరీ మాత, పున్నమ్మతోట, రేడియో స్టేషన్, నక్కలరోడ్డు, అచ్చమాంబ ఆసుపత్రి, అనంతం హాస్పిటల్, ముగ్గురన్నదమ్ముల ఆసుపత్రి, అమెరికన్ ఆసుపత్రి, మాంటిసోరి స్కూలు, బిషప్ అజరయ్య స్కూలు, మాచవరం కొండ, మొగల్రాజపురం గుహలు, ఎస్.ఆర్.ఆర్. కాలేజి, లయోలా కాలేజి, శాతవాహన కాలేజి, గాంధీజీ మునిసిపల్ హైస్కూల్, సి.వి.ఆర్. స్కూలు, ఇవిగో ఇవీ గుర్తుకు రావాలి బెజవాడ పేరు చెప్పగానే. అంతే కాని ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో ఎందుకు చెప్పాలో తెలియనివాళ్లు తీసిన సినిమాలు, చెప్పే మాటలు విని, చూసి బెజవాడ ఇలా వుంటుందని అనుకునేవారికి ఇవన్నీ తెలియాలి. మా బెజవాడ చాలా గొప్పది. “అరవ వాళ్లకి మద్రాస్ ఎంతో అంతకంటే తెలుగు వాడికి బెజవాడ గొప్పది.”
మీకు తెలుసా !!!! ముక్త్యాల రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ !!!!!!!
ఈ రోజు తెలుగు జాతి ఉన్నంతవరకు మరవకూడని ఒక భగీరథుని గురించి వికీపీడియాలో ఉన్న విషయాన్ని యధాతధంగా మీ ముందు ఉంచు తున్నాను . ప్రస్తుతం మీడియా మరియు రాజకీయ నాయకులు ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చూపిస్తున్నాయి. కానీ ఈయనను మర్చి పోవటం చాలా బాధ గా ఉంది.
ఏమిటీ ఈయన ప్రత్యేకత ?
ఆయనే ప్రధాన సూత్రదారి ప్రపంచంలోనే చేతితో ఆంధ్రప్రదేశ్ లో కట్టబడిన నాగార్జున సాగర్ ఆనకట్టకొరకు ఆయన సాధించినవి
మొట్టమొదట కృష్ణనదికి అడ్డుగా పులిచింతల ప్రాజెక్ట్ కొరకు చాలా శ్రమించారు. ఈ రోజువరకూ ఆది పూర్తి కానేలేదు .ఆయనకు అప్పట్లో తెలిసిన సమాచారం మేరకు మద్రాస్ గవర్నమెంట్ కృష్ణ నది నీరును మద్రాస్ కు తరలించేటందుకు కృష్ణ నదిని పెన్నా నదితో కలపడానికి ప్లాన్ వేస్తున్నది. ఆయన 9 జిల్లాలలోని ప్రతి గ్రామం తిరిగి నాగార్జున సాగర్ డాం కోసం సంతకాలు సేకరించారు . ఆయన అతి దట్టమయిన మాచర్ల దగ్గర అడవిగుండా నందికొండ ప్రాంతాన్ని చూసి ఆయన స్వంత ఖర్చుతో రిటైర్డ్ ఇంజనీర్ల ద్వారా ప్రాజెక్ట్ ప్లాన్స్ మరియు డిజైన్స్ గీయించారు. మద్రాస్ ప్రభుత్వం ఈయన ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే కృష్ణ ఫార్మర్స్ సొసైటీని ఏర్పరచి కేంద్ర ప్రభుత్వం మీద చాలా వత్తిడి తీసుకువచ్చారు ...భారత ప్రభుత్వం ఈ డాం విషయం ఖోస్లా కమిటీకి బాధ్యత అప్పగించింది. నందికొండవరకు కారు వెళ్ళడానికి అవకాశం లేదని ఆ ప్రదేశం చూడటానికికూడా ఖోస్లా కమిటే నిరాకరించింది . ఆ సమయంలో రాజా గారు స్వంత ఖర్చుతో 25 గ్రామాలనుండి ప్రజలను వాలంటీర్లను పోగు చేసి రాత్రి, పగలు... వారం రోజులు కష్టపడి రోడ్డు వేసారు. ఖోస్లా కమిటే వచ్చి ఆ ప్రదేశం చూసి ఆప్రదేశం చాలా పెద్ద డాం కట్టడానికి చాలా అనువైన ప్రదేశమని నిర్ణయించింది. ఖోస్లా కమిటీ రిపోర్ట్ ను బుట్టదాఖలు చేసే ప్రయత్నాలు జరుగుతుండగా ఆచార్య N G రంగా గారు, మోటూరి హనుమంతరావు గారు, కొత్త రఘురామయ్య గార్ల సహాయంతో ప్లానింగ్ కమిషన్ అంగీకారం పొందిన తర్వాత ఆంద్రప్రదేశ్ గవర్నర్ చందూలాల్ త్రివేది, ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ అంగీకారంతో, 1954 లో డాం కడుతున్నట్లు ప్రకటన వచ్చింది. పునాది డిసెంబర్ 10న 1955 లో జరిగింది . రాజావారు 52 లక్షలు ఆనకట్టకు విరాళంగా కూడా ఇచ్చారు. ఆగస్ట్ 3 1966న కృష్ణ నీరు రైతులకు వదలటం జరిగింది.......
ఆ భగీరధునికి మరోసారి అందరం జోహార్లు అర్పిద్దాం........🙏🙏
ఈ రోజు వారి శత జయంతి. వారు జన్మించిన తేది 4 అక్టోబరు 1917
మన జిల్లాలో ఎన్ని స్కూల్స్ మరియు విద్యార్థులు ఉన్నారో మీకు తెలుసా.
చాల దారుణమైన పరిస్థితులలో ఉన్నాం మనం ఈ నంబర్స్ చూస్తే. C H A N G E
Krishna District Teachers
Primary Schools 7385
Upper Primary Schools 5585
High schools 11080
Total 24050
Krishna District Schools No
No. of Govt Schools 15
No. of Zilla/Mandal Parishad Schools 2432
No. of Residential Schools 3
No. of Private Schools 1748
No. of Model Schools 2
No. of KGBV Schools 3
No. of Municipal Schools 180
No. of Other Schools 65
Total 4448
యువతా మేలుకో !!!!!! విద్యా వ్యవస్థ లో మార్పు కోసం పోరాడుదాం !!!!!!!!!!!
అందరికి నిర్బందంగా LKG నుండి 12th వరకు చదువు అంతా ఉచితం గానే అందించాలి...
నో ఫీజు...............
నో క్యాస్ట్..............
నో రెలిజిన్.........
సీఎం, అటెండర్ పిల్లలు ఐనా... పిల్లలు అందరూ సమానమే.......
నో ప్రైవేట్ స్కూల్స్......నో మానెజ్మెంట్ ......ఓన్లీగవర్నమెంట్ స్కూల్స్......
టెక్నాలజీ తో పాఠాలు చెప్పేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండేటట్లు
ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ చేస్తానంటే వాళ్ళకే మా సపోర్ట్......
ఇదే మా ఆలోచన !!!!!
ఇదే మా జెండా మరియు అజెండా గా ముందుకువస్తున్నాం
మీ
లక్ష్మి వర ప్రసాద్ కావూరు
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
VIJAYAWADA
Vijayavada