Mandumula Parmeshwar reddy
14/07/2026
🔥*చిలుకా నగర్ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు..!*
*రూ.35 లక్షలతో బొడ్రాయి ప్రాంతంలో..*
*రూ.48 లక్షలతో న్యూ రాంనగర్ లో సీసీ రోడ్ల మరామ్మతులు*
*రూ.30 లక్షలతో స్ర్టామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం*
*కాలనీల వాసులకు నిధుల మంజూరు పత్రాలను అందచేసిన పరమేశ్వర్ రెడ్డి*
చిలుకానగర్ కు మరో సారి ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారు భారీగా నిధులను మంజూరు చేయించారు.
చిలుకానగర్ లో చాలా కాలంగా పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులు పరమేశ్వర్ రెడ్డి గారి కృషి ఫలితంగా మంజూరు అయ్యాయి.
నిధుల మంజూరు పత్రాలను పరమేశ్వర్ రెడ్డి గారు చిలుకానగర్ డివిజన్ లోని వివిధ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులకు నిధుల మంజూరు పత్రాలను అందచేశారు.
*అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైనా తెస్తా: పరమేశ్వర్ రెడ్డి*
ఉప్పల్ నియోజకవర్గం లోని కాలనీలు, మురికివాడల అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయిస్తూ పనులను చేపడుతున్నట్టుగా ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
మన కాలనీలు, మురికివాడల అభివృద్ధికి, సంక్షేమానికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు.
చిలుకానగర్ లో రూ.35 లక్షలతో బొడ్రాయి ప్రాంతంలో సీసీ రోడ్ల మరామ్మతు పనులను చేపట్టనున్నట్టుగా తెలిపారు.
ఇదే కాకుండా మరో రూ.48 లక్షలతో న్యూ రాంనగర్ లోనూ సీసీ రోడ్ల మరామ్మతు పనులను చేపట్టనున్నట్టుగా చెప్పారు.
చిలుకా నగర్ లోని కృష్ణవేణి రూ.30 లక్షలతో స్ర్టామ్ వాటర్ డ్రైన్ నిర్మాణంతో ఇక్కడ నెలకొని ఉన్న సమస్య పరిష్కారం కానున్నట్టుగా తెలిపారు.
కార్యక్రమంలో చిలకనగర్ డివిజన్ అధ్యక్షులు మహేష్ ముదిరాజ్ గారు,ఆగం రెడ్డి గారు,రాజేష్ ముదిరాజ్ గారు,అమరేశ్వరి గారు,సంగీత గారు,లక్ష్మి గారు,. చైతన్య గారు,రేఖ గారు శారద,జమున. వనమాల. జయ. భారతి. ఏ సంతోష్. రాజు. పుణ్య. సంతోష్. విశాల్, జింక లక్ష్మీనారాయణ
బురుగుల కృష్ణ గౌడ్
బూర్గుల రాజేష్ గౌడ్
సకినాల జైన్ ఆసిఫ్ అన్సారి తదితరులు పాల్గొన్నారు
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Uppal