SS Media Entertainment
31/07/2023
దుర్మార్ఘుల పాలన పోవాలే..బహుజన రాజ్యం రావాలి.
Telangana Files | తెలంగాణ వీరుల అమరత్వం.. దొరల పెత్తనం |Martyrs for Telangana freedom | BSP తొలిదశ తెలంగాణ నుంచి నేటి మలిదశ తెలంగాణ దాకా దాదాపు 2000 వేల మంది ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులయ్యారు. ఫలితంగా భౌగో...
10/07/2023
సాయిచంద్ సాకుతో #సార్ దృష్టిలో పడాలని పోటీ పడుతున్న #కొందరు కళాకారులు.!
Saichand పాటగాడే కాదు..ఓ మోటివేటర్,పబ్లిక్ స్పీకర్..తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుడిగా కీలక భూమిక వహించిన ఉధ్యమ కారుడు..వెరసి ఓ నాయకుడు.సమాజాన్ని చైతన్యం చేయడంలో ఓ మహా విస్పోటనం.మనువాదుల మధ్యలో కూడా 'మన'వాదాన్ని నిర్బయంగా మాట్లాడిన నిఖార్సయిన అంబేద్కర్ వాది.BRS పార్టీ కార్యకర్త అయినప్పటికీ.. అంబేద్కరిస్టుల వేదిక కోసం పరితపించేవాడు.ప్రతి సందర్బాన్ని కూడా ఉపయోగించుకున్నాడు.
నాకు తెలిసి సాయి చందన్న,కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాటగాడిగానే మిగిలిపోకుండా పాలనలో కూడా భాగస్వామి కావాలనుకున్నాడు.శక్తిమేరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాడు.కానీ ఎక్కడ కూడా అంబేద్కర్ వాదాన్ని పక్కన పెట్టలేదు.వాదాన్ని ప్రభావశీలంగా ముందుకు తీసుకెల్లడంకోసం ఎంతో పరితపించాడు అనే విషయం అనేక వేదికల్లో అతని మాట,పాటే రుజువు చేస్తాయి.
కానీ ఈ మూల విషయం ప్రస్తావించకుండా, మాట్లాడుకోకుండా సాయిచందు ను స్మరించుకునే సాకుతో..కళాకారులు ను ను జోకుడులో పోటీపడుతున్నారు.సాయిచంద్ పాటగాడి స్థానాన్ని replace చేయడానికి మాత్రమే తహతహలాడుతున్నారు.ఇట్లైతే మిమ్మల్ని ప్రజలు పట్టిచ్చుకోరు గుర్తుంచుకోండి.సాయిచందును పాటగాడి గానే పరిమితం చేయకుండా,స్వరాష్ట్ర సాధనలో ప్రభావశీల ఉధ్యమకారుడిగా,బతికినంత కాలం నమ్మిన సిద్దాంతం పై స్పష్టత కలిగిన నిఖార్సయిన అంబేద్కర్ వాదిగా పరిగణించడమే ఆ అమరుడి ఆశయానికి కొనసాగింపు.
జోహార్ తెలంగాణ అమరవీరుడా.!!
-మీడియా శ్రీనివాస్
(SSMedia Entertainment)
Click here to claim your Sponsored Listing.
Category
Culinary Team
Attire
Website
Address
Shadnagar
509408