Umar Alisha Rural Development Trust
19/03/2026
పిఠాపురం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సభలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ప్రారంభించారు. అలాగే ట్రస్ట్ ద్వారా ఒక విద్యార్థికి 70 వేల రూపాయలు స్కాలర్ షిప్, రాజమహేంద్రవరం ఆశ్రమానికి 50 కుర్చీల నిమిత్తం 32, 500 రూ॥ చెక్కును, నిరుపేద మహిళకు కుట్టు మిషన్, మహిళా ఆర్థిక సాధికారత కోసం ఇడ్లీ పాత్ర, పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు బహూకరించారు.
10/03/2026
2026 మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో నిర్వహించిన సభలో శ్రీమతి ఫర్జానా అలీషా విశిష్ట సేవా పురస్కారాన్ని శ్రీమతి కట్టా లక్ష్మి గారికి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ అలీషా వారి చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను సత్కరించారు.
❤️
08/03/2026
Happy International Women's Day! 👭 ✨
27/12/2025
25-12-25వ తేదీ గురువారం ఉదయం భీమిలి ఆశ్రమం 24వ వార్షికోత్సవ సభ సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యవంలో నిరుపేద మహిళలకు దుప్పట్లు, బియ్యం కిట్లు దాతల సహకారంతో అందించడం జరిగింది.
28/11/2025
వాటర్ ప్లాంట్ ఆవిష్కరణ & నా మొక్క నా శ్వాస
పంచ భూతాలలో నీరు అత్యంత ప్రధానమైనది. ఒక్క నీటి చుక్క కూడా వృథా పోకుండా కాపాడుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో నీటి యుద్ధాలు వస్తాయి అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు హెచ్చరించారు. పిఠాపురం జిల్లా కోర్టు ఆవరణలో 27-11-25వ తేదీ గురువారం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యవంలో ఏర్పాటు చేసిన కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ ను పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, 11వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ ఎం. శ్రీహరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ మెరుగు రాజ్ రావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ ఫణీంద్ర, సూపరింటెండెంట్ శాంతి ప్రియ, కోర్టు స్టాఫ్, ప్లాంటేషన్ కన్వీనర్ శ్రీమతి ముదునూరి సూర్యవతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ మంతెన సుబ్బరాజు గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె శ్రీమతి ముదునూరి సూర్యవతి గారు మినరల్ వాటర్ ప్లాంట్ స్పాన్సరింగ్ చేయగా పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గారు, జడ్జి శ్రీహరి గారు సూర్యవతి గారికి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం కోర్టు ఆవరణలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యవంలో “నా మొక్క నా శ్వాస” అనే కార్యక్రమంలో 36 మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ పి.రాజు, న్యాయమూర్తి శ్రీహరి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎం. రాజారావు తదితరులు పాల్గొన్నారు. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామివారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాద్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యాయమూర్తి శ్రీహరి మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ తో పాటు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మొక్కలు నాటించిన డా ఉమర్ ఆలీషా స్వామి వారికి, ట్రస్ట్ కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
H. No: 11-3-42
Pithapuram
533450
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |
| Sunday | 9am - 5pm |