Somireddy Chandra Mohan Reddy

Somireddy Chandra Mohan Reddy

Share

12/06/2026

2024 జూన్ 4, 12 తేదీలు రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికి రెండేళ్లు. రాష్ట్ర ప్రజలు గొడ్డలి పార్టీకి ఓటుతో పోటు పొడిచి ప్రజాస్వామ్యంతో పాటు ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు. ప్యాలెస్ లకు పరిమతమైన పాలనను తమ ముంగిట్లోకి తెచ్చుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారం, యువనేత, మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి కృషి, పట్టుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని జోడించి ఇటు సంక్షేమం, అటు అభివృద్దితో పాటు పెట్టుబడులు, పరిశ్రమల సాధనలో ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టారు. గొడ్డలి పార్టీ పాలనలో అన్ని సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టిన మొత్తాన్ని ఒక్క ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఖర్చుపెడుతూ పేద ప్రజలపై తనకున్న నిబద్ధత చాటుకుంటున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, దీపం, మత్స్యకారుల సేవలో తదితర ఎన్నో పథకాలతో చరిత్ర సృష్టిస్తున్నారు. టీడీపీ - జనసేన - బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆకాంక్షిస్తున్నాను.

Photos from Somireddy Chandra Mohan Reddy's post 10/06/2026

నెల్లూరులో అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి సమక్షంలో కంపెనీ సీఎస్ఆర్ నిధులతో పోలీసు శాఖకు రూ.24.25 లక్షల విలువైన 6 సర్వైలెన్స్ డ్రోన్లు, రూ.20.65 లక్షల విలువైన 2 వ్యాన్లను అందజేశాం.

శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోంది. భారీ జనసమూహాలు ఉన్న ప్రాంతాలు, పోలీసులు చేరుకోవడం కష్టమైన ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్లు నిఘా నిర్వహించేందుకు ఉపయోగపడతాయి. పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ వాహనాలు, పరికరాలు దోహదపడతాయి.

SEIL సంస్థ గతంలోనూ పోలీసు శాఖకు వాహనాలు అందించడంతో పాటు, సర్వేపల్లి నియోజకవర్గంలో మినరల్ వాటర్ ప్లాంట్లు, ఆస్పత్రులకు పరికరాలు, డయాలసిస్ యూనిట్లు, సోలార్ లైట్లు వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టింది. బ్రహ్మదేవంలో రూ.20 కోట్లతో ఆస్పత్రి, నర్సింగ్ శిక్షణ కేంద్రం నిర్మాణం కూడా కొనసాగుతోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం సీఎస్ఆర్ నిధులు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా సంస్థలు అందిస్తున్న సహకారానికి SEIL యాజమాన్యానికి, ముఖ్యంగా సీఈఓ జన్మేజయ మహాపాత్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Category

Address


26/2/3315, Chaitanya Puri Nagar Street, Chaitanyapuri, Mahathma Gandhi Nagar
Nellore
524004