Madhan Kumar Reddy Nukaraju
24/10/2024
19 వ డివిజన్ అన్నమయ్య సర్కిల్ లో ఉన్న ఎన్టీఆర్ పార్క్ ని నేటి ఉదయం నగర కమీషనర్ సూర్య తేజ గారితో కలసి పార్క్ ని పరిశీలించడం జరిగింది.అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి ఈ పార్కుని తీసుకొని రావాలని నిర్ణయించడం జరిగింది.
11/10/2024
*27 పుణ్య నదుల నుంచి నేడు అభిషేక జలం*
*నేడు ప్రతిష్టాత్మకంగా రావణాసుర వధ కార్యక్రమం*
*నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం రావణాసుర వధ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలో 27 పుణ్య నదుల నుంచి తీసుకువచ్చిన పవిత్రమైన జలాన్ని అభిషేకించి వచ్చిన భక్తులపై చల్లనున్నారు.
గూడూరులోని కోటా సునీల్ కుమార్ స్వామి ప్రత్యేక పూజలు అనంతరం ఈ జలాన్ని టిడిపి నేతలు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డికి అందజేశారు. రావణాసుర వధ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చే వేలాదిమంది భక్తులపై ఈ అభిషేక జలాన్ని చల్లనున్నారు.. వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు
26/09/2024
*నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.*
*ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు.*
*ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు*
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Nellore