Butta Renuka
12/06/2026
_*తేదీ : 12 జూన్ 2026*_
_*స్థలం : కర్నూలు*_
_*వెన్నుపోటు పాలనకు రెండేళ్లు.. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారు*_
_*ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలకు అన్యాయం చేసిన ప్రభుత్వంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా*_
_*ప్రజల తరఫున ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దుర్మార్గం : శ్రీమతి బుట్టా రేణుక*_
_*ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుంది.*_
_రెండు సంవత్సరాల క్రితం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, నేడు ఆ హామీలను పూర్తిగా విస్మరించి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని ఆరోపిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, మహాధర్నా కార్యక్రమం నిర్వహించబడింది._
_వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇంచార్జ్, కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వీ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువజన ప్రతినిధులు, విద్యార్థులు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు._
_కర్నూలు జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ రోడ్డు నుండి ప్రారంభమైన భారీ నిరసన ర్యాలీ జిల్లా పరిషత్ ప్రక్కన ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ర్యాలీ సందర్భంగా పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు._
_ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక గారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అధికారాన్ని అనుభవించడం ప్రజలను మోసం చేయడమేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు, నేడు ప్రభుత్వ పనితీరుకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు._
_ప్రతి మహిళకు నెలకు రూ.1,500 అందిస్తామని చెప్పిన ఆడబిడ్డ నిధి హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని ఎందుకు అమలు చేయలేకపోయిందని నిలదీశారు. మహిళల సంక్షేమం పేరుతో ఓట్లు అడిగి, అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను పూర్తిగా నిరాశపరిచారని విమర్శించారు._
_తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల ఆశలను ఎందుకు వమ్ము చేసిందని శ్రీమతి బుట్టా రేణుక గారు ప్రశ్నించారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువులకు పూర్తి భరోసా కల్పిస్తామని చెప్పిన హామీలు నేడు ఏమయ్యాయని నిలదీశారు._
_నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, రెండు సంవత్సరాలు గడిచినా ఆ హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువతను ప్రభుత్వం నిరాశపరిచిందని ఆరోపించారు._
_రైతులకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన అన్నదాత పథకం పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. సాగు వ్యయాలు పెరిగి రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు._
_మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన ప్రభుత్వం, ఆ హామీని ఎందుకు అమలు చేయలేకపోయిందని ప్రశ్నించారు. మహిళల కోసం పనిచేస్తున్నామని చెప్పే ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీలను ఎందుకు విస్మరించిందని నిలదీశారు._
_నిరుద్యోగ యువతకు ఆశలు కల్పిస్తూ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆ ప్రక్రియను వివాదాస్పదంగా మార్చిందని శ్రీమతి బుట్టా రేణుక గారు విమర్శించారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రచారం చేసి, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా దొడ్డి దారిన అమ్ముకున్న పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వంలోనే చూడడం చాలా దుర్మార్గమని నిరుద్యోగ యువతకు ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని, అభ్యర్థుల్లో ఏర్పడిన అనుమానాలు, యువతలో నెలకొన్న ఆందోళనలతో అది చివరకు "దగా డీఎస్సీ"గా మారిపోయిందని ఆరోపించారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు._
_ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని శ్రీమతి బుట్టా రేణుక గారు ప్రశ్నించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారిపై, ఎన్నికల హామీల అమలును కోరిన వారిపై, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన వారిపై కేసులు నమోదు చేయడం ద్వారా భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు._
_టిడిపి నాయకుల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించిన వారిపైనే కేసులు నమోదు చేయడం దారుణమని ఆమె పేర్కొన్నారు. ప్రజల తరఫున మాట్లాడే నాయకులను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతూ మానసికంగా వేధించే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆరోపించారు._
_ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, నేడు ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని శ్రీమతి బుట్టా రేణుక గారు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వం కేసులతో నోళ్లు మూయించాలని చూస్తోందని, కానీ ప్రజల పక్షాన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు._
_రాష్ట్రంలో మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో తీవ్ర నిరాశకు గురయ్యారని ఆమె పేర్కొన్నారు. ప్రజల ఆశలను దెబ్బతీసి, ఎన్నికల హామీలను విస్మరించి, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు._
_ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతిసారీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని, ఎన్నికల హామీల అమలు కోసం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం కొనసాగిస్తుందని శ్రీమతి బుట్టా రేణుక గారు స్పష్టం చేశారు._
_ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళ విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి ఎస్వీ విజయ మనోహరి గారు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు._
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
డీఎస్సీ భాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు, నియామకాలలో జరిగిన ప్రతి అవకతవకపై నిజాలు వెలుగులోకి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని, నిరుద్యోగ యువత తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నిరంతరం పోరాడుతుందని యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్ & కాటసాని శివ నరసింహారెడ్డి స్పష్టం చేశారు.
Youthwing
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Address
Kurnool