Sudhakar Medicals R.S Rangapuram
25/05/2024
బీపీని అదుపు చేసే ఆహారం అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్).. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ...
25/05/2024
Summer Diet: అందుకే వేసవిలో వీటిని తీసుకోవాలి వేసవిలో వాతావరణంలోని విపరీతమైన వేడి శరీరంలోని నీటినంతటినీ చెమట రూపంలో పీల్చేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు ...
*ఛాతీలో మంట అనగా ఏమిటి? దానిని నివారించటం లేదా తగ్గించుకోవటం అవగాహనా కోసం *
ఛాతీలో మంట (Heartburn) దీనినే అసిడిటీ (acidity) లేదా ఆసిడ్ రిఫ్లెక్స్ (acid reflux) అని కూడా చెప్పవచ్చు. ఈ సమస్య ఉన్నవారు ఆహారం తీసుకున్న తర్వాత చాలా సమయం వరకు ఛాతీలో మంటగా ఉంటుంది, పుల్లటి త్రేన్పులు ఎక్కువగా వస్తుంటాయి మరియు గొంతులో అసౌకర్యంగా ఉంటుంది. (Heartburn) ఛాతీలో మంటకి గుండెకి సంబంధం లేదు, ఇది గుండె సంబంధ వ్యాధి కాదు. ఈ పరుగుల ప్రపంచంలో ఇంటి భోజనం తినడం రోజు అందరికీ కుదరదు అలాంటపుడు అందుబాటులో ఉన్న హోటల్స్ లోనో కాంటీన్లలో తింటారు. ఇలా బయట ఆహారం తినటం, సమయానికి భోజనం తినకుండా చిరుతిళ్ళు తినటం, సోడా వంటి పానీయాలు త్రాగటం, రోజు కాఫీ త్రాగటం లాంటి అలవాట్లు ఛాతీలో మంటకు కారణం
*👉🏿అసిడిటీ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు:*
పొట్ట పైభాగం నుండి గొంతులోకి అసౌకర్యం, మంటగా ఉంటుంది. ఇది ముఖ్య లక్షణం.
గొంతు మరియు నోరు పుల్లగా మారటం.
కొన్నిసార్లు దీని వలన దంతాలు కూడా రంగు మారతాయి.
త్రేన్పులు రావటం, ఏమి తినకపోయినా త్రేన్పులు వస్తూ ఉంటాయి.
పొట్ట ఉబ్బరంగా ఉండటం అంటే లోపల గ్యాస్ చేరి పొట్ట లావుగా ఉబ్బినట్టు ఉంటుంది.
ఆహారం తిన్న తర్వాత వికారంగా అనిపించటం.
తిన్న పదార్ధాలు బయటకి వస్తునట్టు అనిపించటం.
పొట్ట పైభాగంలో నొప్పి రావచ్చు.
ఛాతీలో మంటగా అనిపిస్తుంది.
మింగటానికి ఇబ్బందిగా ఉంటుంది.
గొంతులో పుండు ఉనట్టు లేదా గొంతులో గరగర అనిపిస్తుంది.
పొడి దగ్గు వస్తుంది.
ఈ అసిడిటీ లేదా ఛాతీలో మంట అప్పుడప్పుడు వస్తుంటే ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ ఒక వారానికి రెండు సార్లు కంటే ఎక్కువగా వస్తుంటే వైద్యుని సంప్రదించాలి. మందులతో అదుపులోకి వస్తుంది. చాలా అరుదుగా కడుపులో పుండ్లు వచ్చి కాన్సర్ వ్యాధికి దారి తీయవచ్చు. అందరికీ ఇలా జరగదు అని గమనించాలి.
*👉🏿ఛాతీలో మంటకి గుండె నొప్పికి తేడా ఏంటి?*
ఛాతీలో మంట అనేది కడుపులో నుండి మొదలై గొంతులోకి వస్తుంది, పుల్లటి త్రేన్పులు రావటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. గుండెలో నొప్పి పొట్ట పైభాగంలో ఎడమ పక్కన మొదలవుతుంది. అది మెడ భుజం వరకు కూడా పాకవచ్చు. ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉండవచ్చు. ఇవి గుండె నొప్పి లక్షణాలు. మీకు రెండిటికి తేడా తెలియనపుడు వైద్యుని కలవటం శ్రేయస్కరం.
*👉🏿చికిత్స:*
మందులు వాడటం వలన ఈ అసిడిటీ సమస్య అదుపులో ఉంటుంది. ఒకవేళ మందులకి తగ్గకపోతే ఆపరేషన్ చేసి ఆమ్లాలు అన్నవాహికలోకి రాకుండా చేస్తారు. దాని వలన ఉపశమనం లభిస్తుంది.
*👉🏿అసిడిటీ తగ్గటానికి సహజ మార్గాలు*:
అసిడిటీ తగ్గటానికి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోజు వాటిని వాడటం వలన వేరే ఇబ్బందులు తలెత్తవచ్చు. మరి సహజంగా ఛాతీలో మంటని తగ్గించుకోవటం సాధ్యమేనా. అవును చాలా పద్ధతులు ఉన్నాయి సహజంగా చేసుకోదగినవి. వీటిలో కొన్ని చిట్కాలు మనం తెలుసుకుందాం
యాలుకలు – మీరు అసిడిటీ సమస్య తగ్గాలంటే ఇంట్లో చేసుకోగల ఉపాయం ఇది. రెండు లేదా మూడు యాలుకలు మెత్తగా దంచి ఒక గ్లాస్ నీటిలో కలిపి మరిగించాలి. దీన్ని తాగటం వలన ఛాతీలో మంట నుండి ఉపశమనం లభిస్తుంది.
ఇంట్లో ఉండే వాము, ఆవు నెయ్యి మరియు కండ చెక్కెర కలిపి ఒక చక్కటి ఔషధం తయారు చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం ఒక 100 గ్రాములు వాము తీసుకుని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత 100 గ్రాములు కండ చెక్కెర కూడా మెత్తగా పొడి చెయ్యాలి. ఈ రెండిటిని తీసుకుని మరిగించిన 100 గ్రాములు ఆవు నెయ్యిలో కలిపాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. రెండు పూటల భోజనానికి ఒక గంట ముందు దీన్నిఒక చెంచా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ అదుపులో ఉంటుంది. మెల్లమెల్లగా సమస్య తగ్గిపోతుంది. అందరూ సులభంగా ఇంట్లో చేసుకోవచ్చు. ప్రయత్నించి అసిడిటీ సమస్య నుండి విముక్తి పొందండి.
నిమ్మకాయ, నల్ల ఉప్పు (బblack salt), జీలకర్ర పొడి, పసుపు వాడి అసిడిటీ ఎలా తగ్గించాలో చూద్దాం. ముందుగా ఒక నిమ్మకాయని కోసి సగం ముక్కని తీసుకుని పొయ్యి మీద కాల్చాలి. 30 సెకండ్స్ సమయం పట్టచ్చు.తర్వాత దీనికి పసుపు, నల్ల ఉప్పు, జీర పొడి పట్టించాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయని తినాలి. నిమ్మకాయ సరిపడని వారు తినవద్దు. ఇలా చెయ్యటం వలన వెంటనే అసిడిటీ నుండి ఉపశమనం కలుగుతుంది. చేసుకోవటం కూడా చాలా సులభం.
ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో పసుపు కొంచెం ఉప్పు కలిపి తాగాలి. దీని వలన ఛాతీలో మంట త్వరగా తగ్గుతుంది.అధిక రక్త పోటు ఉన్నవారు దీన్ని రోజు తాగకూడదు.
భోజనం తర్వాత ఒక అర గ్లాస్ నీటిలో కొంచెం వాము పొడి మరియు నల్ల ఉప్పు కలిపి తాగటం వలన వెంటనే అసిడిటీ నుండి ఉపశమనం ఉంటుంది లేదా అసిడిటీ రాకుండా చేస్తుంది.
లవంగాలు – లవంగాలు పొడి దగ్గునే కాదు, ఛాతీలో మంటని కూడా తగ్గిస్తాయి. రెండు లేదా మూడు లవంగాలు నోట్లోనే ఉంచి చప్పరించాలి. ఆ రసం మింగేయాలి. దీని వలన అసిడిటీ తగ్గుతుంది. ఇది చాలా సులభ మార్గం. ఇంట్లోనే కాదు, బయట ఉన్నా కూడా చేయవచ్చు. ఉద్యోగస్తులు కూడా సులభంగా ఆచరించవచ్చు. మీతో పాటు ఎప్పుడూ కొన్ని లవంగాలు బాగ్ లో ఉంచుకోండి.
తులసి ఆకులు – ప్రతి ఇంట్లో తులసి మొక్కలు విరివిగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఛాతీలో మంట మొదలవగానే ఆరు లేదా ఏడు తులసి ఆకులు నమిలి తినేయాలి. బాగా ఉపశమనం ఉంటుంది. ఇది కష్టము కాదు ఖర్చు లేదు. పైగా ఎటువంటి ఇబ్బందులు రావు.
జీలకర్రని నూరి పెట్టుకోవాలి. భోజనానికి ముందు ఇది ఒక చెంచా తిని అర గ్లాస్ నీరు తాగితే అసిడిటీ రాదు. జీలకర్ర ఆహారం జీర్ణం అవటంలో కూడా దోహదపడుతుంది.
*నివారణ మార్గాలు:*
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పదార్ధాలు తినకూడదు.
భోజనంలో అధిక శాతం కూరగాయలు రోజు ఉండేలా చూసుకోవాలి. ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలు ఏవైనా ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి.
ఆహారం ఒకేసారి ఎక్కువగా తినకుండా కొంచెం కొంచెంగా తినాలి. అపుడు ఈ సమస్య అదుపులో ఉంటుంది.
*👉🏿పొగ త్రాగటం* మానివేయాలి. లేదంటే ఈ సమస్య అలాగే కొనసాగుతుంది.
*👉🏿ఊబకాయం* మరొక ముఖ్య కారణం. బరువు తగ్గటం వలన అసిడిటీ కూడా తగ్గుతుంది. చాలా సమస్యలకు బరువు తగ్గటం అనేది అవసరం.
మద్యపానం తాగటం మానివేయాలి లేదంటే అసిడిటీ తీవ్రత ఎక్కువ అవచ్చు.
సమయ పాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తినకూడదు.
ఘాటైన మసాలా పదార్ధాలు తినటం తగ్గించాలి. ఇవి పుల్లటి త్రేన్పులు మరియు మంట కలగజేస్తాయి.
వేపుడు కూరలు ఎక్కువగా తినకుండా ఉంటే మంచిది.
పొట్టకి సంబందించిన కొన్ని రకాల వ్యాయామాలు చేసేటపుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాటి వలన అసిడిటీ ఎక్కువ అవచ్చు. అందువలన మీకు తగినట్టు వ్యాయామాలు చేసుకోవాలీ
*ధన్యవాదములు🙏*
*సభ్యులకు విజ్ఞప్తి*
మన గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
R. S. RANGAPURAM, BUSTAND. BETHAMCHERLA MANDAL
Kurnool
518002
Opening Hours
| Monday | 8am - 9:30pm |
| Tuesday | 8am - 9:30pm |
| Wednesday | 8am - 9:30pm |
| Thursday | 8am - 9:30pm |
| Friday | 8am - 9:30pm |
| Saturday | 8am - 9:30pm |
| Sunday | 8am - 9:30pm |