Gajula Swetha Reddy
09/06/2026
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు – నల్ల బెలూన్లతో నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ నాయకులు
పాణ్యం నియోజకవర్గం
కల్లూరు అర్బన్‌లోని ముజఫర్‌నగర్ సమీపంలో ఉన్న ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమానికి ముందు వైఎస్సార్సీపీ నాయకులు నల్ల బెలూన్లను గాల్లోకి ఎగురవేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు, కర్నూలు నగర మాజీ మేయర్ బి.వై. రామయ్య గారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు గాజుల శ్వేతా రెడ్డి గారు, పార్టీ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాటసాని రామభూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు “సూపర్ సిక్స్” పేరుతో మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారని విమర్శించారు.
ఆడబిడ్డ నిధి, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతులకు గిట్టుబాటు ధరలు, మహిళలకు ఆర్థిక భరోసా వంటి కీలక హామీలు నేటికీ అమలు కాలేదని అన్నారు.
రాష్ట్రంలో సంక్షేమ పాలనను పక్కనపెట్టి రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలతో కాలం గడుపుతోందని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ గ్రామ గ్రామాన, వార్డు వార్డులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని కాటసాని రామభూపాల్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
YSJagan WomenWing ZonalPresident
WeYSRCP JaganannaConnects
31/05/2026
చలో జిల్లా కలెక్టరేట్
మెగా డీఎస్సీ పేరుతో కుట్రలు వద్దు – నిరుద్యోగులకు న్యాయం చేయాలి!
📢 రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.
📢 మెగా డీఎస్సీ పేరుతో ఖాళీలను తగ్గించే ప్రయత్నాలను నిలిపివేయాలి.
📢 అన్ని ఖాళీలను పారదర్శకంగా భర్తీ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
📢 నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దు.
🗓 తేదీ: 01 జూన్ 2026
🕙 సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 స్థలం: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం,
నిరుద్యోగులు, విద్యార్థులు, యువజనులు మరియు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
"ఉద్యోగం మా హక్కు – న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత!" ✊
28/05/2026
బక్రీద్ పండుగ శుభాకాంక్షలు 🌙
అల్లాహ్ ఆశీస్సులతో మీ కుటుంబంలో
సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి నిండాలని కోరుకుంటున్నాం.
త్యాగం, ప్రేమ, సహనం సందేశాన్ని పంచే ఈ పవిత్ర పండుగ మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలి.
🕌 ఈద్ ముబారక్!
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Kurnool