Budda Reddy Yashaswini MPP
05/12/2025
ఘనంగా ఆత్మీయ సమావేశం..
విద్యార్థులు తమ ఉజ్వల్ భవిష్యత్తు కోసం బాగా చదువు కోవాలని మన శ్రీశైల నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమాన్ని మహానంది మండలంలోని అన్ని పాఠశాలల్లో పండుగలా నిర్వ హించారు. శుక్రవారం తిమ్మాపురం మోడల్ స్కూల్ నందు నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేసి కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి గారు, ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్వని గారు, ఎంపీడీవో మహబూబ్ దౌలా, ఎంఈవో రామసుబ్బయ్య , స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మణరావు, మండల పార్టీ కన్వీనర్ కంచర్ల శివ, క్లస్టర్ ఇంచార్జి నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి, స్థానిక టిడిపి నాయకులు రామ్ భూపాల్ రెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
25/11/2025
మహానందిలో "రైతన్న.. మీ కోసం.." కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్వని గారు
వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారని దీనికోసం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందని మహానంది మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని గారు అన్నారు. మంగళవారం మహానందిలో ఎంపీపీ గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దేశ ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు సాంప్రదాయ వ్యవసాయంపై ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించే దిశగా "రైతన్న మీ కోసం" కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 24 నుండి 29వ తేదీ వరకూ చేపట్టినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఒక యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, మీ పంట ఎలా ఉంది, సమయానుకూలంగా ఏయే చర్యలు తీసుకోవాలి, పండిన పంట ధరలు ఏ విధంగా ఉన్నాయి, వేసిన పంట ఎప్పుడు కోతకు వస్తుంది తదితర వివరాలతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి మొదలు గ్రామ వ్యవసాయ అధికారి వరకూ అందరి సెల్ ఫోన్ నెంబర్లతో సహా యాప్‌లో పొందుపర్చడం జరిగిందన్నారు. ఈనెల 29వ తేదీ వరకూ గ్రామాల్లో అధికారులు పర్యటించి రైతులకు వ్యవసాయ పరిస్థితులపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల పార్టీ కన్వీనర్ కంచర్ల శివ, క్లస్టర్ ఇంచార్జి చంద్రమౌళీశ్వర్ రెడ్డి, స్థానిక టిడిపి నాయకులు గంగిశెట్టి మల్లికార్జునరావు, సుదర్శన్ రెడ్డి, మహిళా నాయకురాలు కొమ్మొద్ది ఉమాదేవి, హరినాథ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Kurnool