CLN Raju

CLN Raju

Share

28/01/2026

* మహారాష్ట్రలో ఘోరం
* విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం
* బారామతిలో కుప్పకూలిన అజిత్ పవార్ విమానం
* విమానం ల్యాండ్ అవుతుండగా దుర్ఘటన
* బారామతిలో ఓ సభకు వెళ్తుండగా ప్రమాదం
* ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఆరుగురు మృతి చెందినట్లు DGCA నిర్ధారణ

09/01/2026

అమరావతిపై జగన్ స్టాండ్ మారలేదా..?

ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ఇంకా గందరగోళంలోనే ఉన్నట్టు అర్థమవుతోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ మరోసారి రాజధానిగా అమరావతి సరికాదనేలా స్టేట్‌మెంట్ ఇచ్చారు. కృష్ణానదిలో అమరావతి నిర్మిస్తున్నారని, ఇది రాజధానికి అనువైన ప్రాంతం కాదన్నారు. రాజధాని నిర్మాణానికి లక్షకోట్లు కావాలన్నారు.

2014-19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ, అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ స్వాగతించింది. సాక్షాత్తూ అసెంబ్లీలో జగన్ అమరావతికి జైకొట్టారు. ఆ తర్వాత 2019లో జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని పట్టించుకోలేదు. పైగా మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తెచ్చారు. అయితే అమరావతి ప్రాంత రైతుల ఉద్యమాలు, కోర్టు చీవాట్ల నేపథ్యంలో మూడు రాజధానుల విధానంపై జగన్ ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది.

2024 ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయానికి మూడు రాజధానుల విధానం కూడా కారణమని భావించారు. దీంతో వైసీపీ తన స్టాండ్ మార్చుకుంటుందని ఆశించారు. అన్నట్టుగానే ఆ పార్టీ నేత సజ్జల, తాము అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. రేపు జగన్ అధికారంలోకి వచ్చినా అమరావతి నుంచి పరిపాలిస్తారన్నారు. దీంతో వైసీపీ దారికొచ్చిందనుకున్నారు.

అయితే ఇప్పుడు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరోసారి బాంబ్ పేల్చారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందన్నారు. అమరావతిపై మరోసారి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇదిప్పుడు సంచలనం కలిగిస్తోంది. వైసీపీ స్టాండ్ మారలేదని ఆయన తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఇదే ఆ పార్టీ విధానమైతే, మున్ముందు ఆ పార్టీకి, ఆ పార్టీ నేతలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

Want your public figure to be the top-listed Public Figure in Kukatpalli?
Click here to claim your Sponsored Listing.

Category

Culinary Team

Attire

Telephone

Website

Address


Kukatpalli
500072