Ismart Maths Karimnagar

Ismart Maths Karimnagar

Share

Photos from Ismart Maths Karimnagar's post 26/01/2025

20% Discount on Learn 100+ Maths Skills

14/10/2024

చాలా ఏళ్ళ తరువాత... నిన్న ఒకే రోజు.. రెండు సినిమాలు చూసా . పొద్దున్న - వెట్టయ్యన్ .
మధ్యాహ్నం - జనక అయితే కనుక .
“ జనక అయితే కనుక “ లో పిల్లని పెంచడం లో మధ్య తరగతి కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక కష్టాలు చూపారు .
స్కూల్ ఫీజుల దోపిడీ నిజం .
అత్యధిక శాతం పాఠశాలలు ... నియమాల్ని పాటించకపోవడం నిజం .
సమస్య కు మరో కోణం .
నేటి తరం పేరెంట్స్ లో ఒక స్పష్టమయిన ట్రెండ్ కనిపిస్తోంది .
👉ఫీజు ఎంత ఎక్కువుంటే స్కూల్, అంత గొప్పదని అనుకొంటున్నారు .
👉తమ తాహతుకు మించిన పాఠశాలలో పిల్లలని చేర్పిస్తున్నారు .
👉తమ పిల్లలు చదివే స్కూల్ తమ స్టేటస్ సింబల్ అని భావిస్తున్నారు .
👉” ఇరవై ఎకరాల స్థలం .. గుర్రపు స్వారీ .. ఫెన్సింగ్ , ఆర్చరీ , గోల్ఫ్, , బబుల్ సాకర్ , జుగర్ , కానోయింగ్, అండర్ వాటర్ హాకీ “ .. అనే ప్రకటనలు చూసి మురిసి పోయి చేర్పిస్తున్నారు .
ఇందులో పిల్లలు ఆడేదెంత ?
నేర్చుకొనేదేంత ??
అని ఆలోచించడం లేదు.
👉వేలం వెర్రి .
“ పక్కింటావిడ తన కొడుకును... సంవత్సరానికి పది లక్షల ఫీజు... ఇంటర్నేషనల్... సీఈబీఎస్సీ స్కూల్ లో చేర్పించనప్పటినుంచి భూమిపై నిలబడడం లేదు . మన పిల్లాడ్ని... కనీసం పదహైదు లక్షల ఫీజు స్కూల్ లో చేర్పించాలి . వచ్చే వారం కిట్టి పార్టీ లో ఆమె పొగరణచాలి అంతే “. భర్త ఒప్పుకొనేదాకా పగలు రాత్రి పస్తులు పడుకోపెట్టేస్తుంది.
వినక చస్తాడా?
వినక పొతే చస్తాడు !!
"పేరు గొప్ప" పాటశాలలో చేరిస్తే పిలల్లు కూడా అలాగే తయారవుతున్నారు . "మా ఫ్రెండ్స్ దసరా కు సింగపూర్ వెళ్లారు .. మనం జపాన్ పోదాం" . " వాళ్ళ కారు ఇది .. ఐ ఫోన్ ఇది .. మనకేది? .. ఇలా మొదలవుతుంది ....
అంతం కాదది ..
... డాంభికాల గాలిబుడగ జీవితానికి ఆరంభం .
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగు కావడం తో... ఆధునిక గృహిణి పని భారం పెరిగిన మాట నిజం .
పురుష పుంగవులు ఇంకా గుమ్మడి కాలంలోనే ఉండి పోతున్న మాట నిజం .
భర్తతో పాటు ఆఫీసుకు వెళ్లి వచ్చిన, ఆధునిక గృహిణి... ఆయన గారు కాలుపై కాలువేసుకొని సోఫా లో కూర్చుంటే... ఇంటి పని... వంట పని... పిల్లల పని ... చెయ్యలేక సతమతమవుతున్న మాట నిజం .
అదే సమయం లో పిల్లలకు ఏడాది వయసులోనే సెల్ ఫోన్ అలవాటు చేసి .. " అయ్యో! నేనేమి చేసేది? .. సెల్ ఫోన్ లేకుంటే వాడు అన్నం తినడు! .. అరిచి గోల చేస్తాడు!! అని తెలుగు టీవీ డైలీ సీరియల్స్ స్థాయిలో శోకాలు ఒలకబోస్తున్నది కూడా నిజం .
ఏ పాఠశాలలో చేర్పించావు అనేది .. ఇప్పుడు కేవలం తల్లితండ్రి బిల్డ్ అప్ కోసమే . "ఏ రాయియతేనేమి పళ్లూడ గొట్టు కోవడానికి ?అన్నట్టు .వీడియో . గేములు .. పాలపళ్ళు... ఊడక ముందే నీలి చిత్రాలు , పట్టరాని కోపం .. అసహనం , చిరాకు నిద్రలేమి .. ఏకాగ్రత లోపం .. ఆరో ఏడు తరగతుల్లో నుంచి మొదలెట్టి టీన్ ఏజ్ ప్రేమలు .. ఇంకాస్త ముదిరి పాఠశాల ప్రాంగణం లోనే ముద్దులు .. హుక్కా పెన్స్ .. వోడ్కా .. గంజాయి .. బుల్లియింగ్ .. ఆన్లైన్ బెట్టింగ్ .. ఇదీ నేటి రేపటి పౌరుల లోకం .
గమనించరు.
చూసినా పట్టించుకోరు ..
పట్టించుకున్నా ఏమి చేయలేరు .
"ఈ కాలం పిల్లలు ఇంతేలే" అని సరిపెట్టుకొంటున్నారు .
2010 తరువాత పుట్టిన పిల్లల్ని ఆల్ఫా జెనరేషన్ అంటారు .
వీరి తల్లితండ్రులు ఆల్ఫా తరం పేరెంట్స్ .
వీరిలో తొంబై శాతం బిల్డ్ అప్ మనుషులు .
ఎవడైనా పిచ్చోడు వద్దురా బాబు .. కరోనా వాక్ సీన్ ... విషంతో సమానం అని చెబితే "... " అందరూ వేసుకొంటున్నారు . తప్పేముంది? " అని లైన్ లో నిలుచుని... సూది మందు గుచ్చుకొని ... ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లో ఫోటో లు పెట్టి మురిసి... ఇప్పుడు రకరకాల సైడ్ రియాక్షన్స్ బాధపడుతున్నట్టే ...
" సెల్ ఫోన్ వద్దు .. స్కూల్ లో మిగతా పిల్లలు... ఫోన్ వాడుతుంటే మీరు మీ పిల్లల్ని నిలవరించలేరు . మీరు స్కూల్ లో పిల్లలకు ఫోన్ వల్ల కలిగే నష్టాల గురించి చెప్పండి . లేకుంటే మీ స్కూల్ నుంచి TC గ్యారెంటీ అని చెప్పండి . దెబ్బకు దిగొస్తారు"... అని నాలాంటి వాళ్ళు చెబుతుంటే .. .. " మా స్కూల్ లో పిల్లలకు సెల్ ఫోన్ ద్వారా హోమ్ వర్క్ ఇస్తారు .. ఇంటికొచ్చాక వాడు గూగుల్ తో బిజీ .. ఇంకేముంది .. మరో రెండేళ్లకు బిళ్ళ గేట్ అయిపోతాడు" అని మురిసి పోయే మూర్కులు కోకొల్లలు .
లండన్ నుంచి హరి కృష్ణ " సార్ ! సాఫ్ట్ వెర్ లో ఉన్న మా ఫ్రెండ్స్ నలుగురితో మాట్లాడాను . అందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్ . ఇంటికొచ్చాక సెల్ ఫోన్ తో కాలక్షేపం తప్పించి రూపాయ ప్రయోజనం లేదు ! చదువు చట్టుబండలయ్యింది " అని నలుగురూ ఏడుస్తున్నారు . దీని గురించి రాయండి సార్ " అని మెసేజ్ .
"చెబితే జనాలు వినేటట్టు అయితే ఇంకేముంది హరికృష్ణ గారు?" అని రిప్లై ఇచ్చాను .
జనాలు వినరు అంటే ఘటన గుర్తొచ్చింది .
మొన్న ఒక ఫంక్షన్ కు వెళ్ళాము .
మా పాత అపార్ట్మెంట్ కు చెందిన ఇరవై మంది దాకా అక్కడికి వచ్చారు .
మూడేళ్ళుగా వారిని కలవలేదు .
ఈ మూడేళ్ళలో అందరూ పదహైదు సంవత్సరాల వయసు పై బడ్డారు .
" అదేంటి అమర్నాథ్ గారు .. మూడేళ్ళుగా మమల్ని పూర్తిగా వదిలేసారు . వెనుక నుంచి చూసి మీరేనా ?లేక మీ అబ్బాయా ? అని చర్చించుకొంటున్నాము " అని వాళ్ళు మాట్లాడతుంటే ..... కరోనా కాలం లో అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్ లో "ఎండ .. డి విటమిన్... బి 12 విటమిన్ .. వాక్ సీన్ వద్దు " అని ఎన్నో సార్లు నేను పెట్టిన పోస్టులు ..దాన్ని వారి పట్టించుకోని వైనం .. అన్నీ గుర్తొచ్చాయి .
విషయం తెలియదు .
అవతలి వాడు చెప్పేది మంచో చెడో తెలుసుకోలేరు ..
ఇదే నేటి ప్రపంచం .
కంప్యూటర్ మొరాయించింది . ప్రతి సారికి హ్యాంగ్ అయ్యింది . పోస్ట్ చేసింది సేవ్ కాదు . పది సార్లు ఎడిట్ చెయ్యాల్సి వచ్చింది

Facebook post by
Amarnath Vasireddy

21/09/2024
19/09/2024

👉🏻 To get this on WhatsApp click the link https://wa.me/917207439500?text=study_material

Want your school to be the top-listed School/college in Karimnagar?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Vaninikethan PG College Road , JyothiNagar
Karimnagar
505302