Dharmaram

Dharmaram

Share

30/05/2018

ధర్మారం గ్రామ పంచాయతీ గతంలో బొమ్మారెడ్డిపల్లె రెవెన్యూ గ్రామపంచాయతికి అనుబందంగా ఉండేది. పరిపాలన సౌలభ్యం కోసం మండలాల విభజన జరిగినప్పుడు ధర్మారం మండలం ఏర్పడి, మండల కేంద్రమైన ధర్మారం ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది..
ధర్మారం మండల కేంద్రం చుట్టూ దాదాపు 30 గ్రామాల ప్రజలకు రాకపోకలకు సౌలభ్యంగా ఉండటంతో క్రమేణా ఇక్కడ వ్యాపార, వాణిజ్యం పుంజుకుంది. నూతన బస్టాండు నిర్మాణం మరియు 7వ నంబరు రాష్ట్ర రహదారి నిర్మాణం తో ధర్మారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గణనీయంగా పెరిగి చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి ధర్మారంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు.
ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేయడంతో వేలమంది విధ్యార్థులు ప్రతిరోజూ ధర్మారంకి రాకపోకలు సాగిస్తున్నారు. జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. వాణిజ్యం పెరగడంతో చాలామందికి ఉపాది లభిస్తుంది.

గతంలో కరీంనగర్ జిల్లాలో భాగమైన ధర్మారం జిల్లాల విభజనతో పెద్దపల్లి జిల్లాలో భాగమైంది. నియోజకవర్గ పునర్విభజనకు ముందు మేడారం నియోజకవర్గంలో ఉన్న ధర్మారం నేడు ధర్మపురి నియోజకవర్గంలో ఉంది.

Photos 28/07/2015

తెలంగాణకు ఆంధ్రకు తేడా ఏంటి ?
తెలంగాణలో ప్రజలు ఎలా వ్యవహరిస్తారు ?
తమ ఇంటికి వచ్చిన వ్యక్తిని .. తమ ఊరికి వచ్చిన వ్యక్తిని ఎలా ఆదరిస్తారు ?
అన్నది సాక్షాత్తు ఆంద్రాకు చెందిన ప్రముఖ సినీ రచయిత, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టంగా తేల్చిచెప్పాడు. ఆయన తన సునిశిత పరిశీలన తెలంగాణ గొప్పదనాన్ని చాటి చెప్పారు.“తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా .. ఏ ఇంటికి వెళ్లినా బాబు ఛాయ తాగుతావా ? అన్నం తింటావా ? అని అడుగుతారు. ఎదుటి వ్యక్తి సోషల్ స్టేటస్ గురించి .. అతను ఎంత సంపాదిస్తాడు ? అతడు ఎవరు ? అన్నదిపట్టించుకోరు. ఇది నాకు ఎంతో బాగా నచ్చుతుంది. అదే ఆంధ్రాలో ఎక్కడికి వెళ్లినా ముందు నువ్వు ఏం చేస్తావు బాబు ? మీ నాన్నగారు ఏం చేస్తారు ? అంటూ సోషల్ స్టేటస్ కనుక్కుంటారు. దాన్ని బట్టే మర్యాద ఇస్తారు” అని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.ఆంధ్రలో మనుషుల మధ్య సంబంధాలు ఆర్థిక సంబంధాలుగానే ఉంటాయి. మనిషి ఆర్థిక స్థితిని బట్టి అతనికి గౌరవం ఉంటుంది. కానీ తెలంగాణలో డబ్బుకు ప్రాధాన్యం చాలా తక్కువ. మానవత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే వీలయినంతవరకు అతనిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు.

Photos from Mango News's post 28/07/2015
I Am That Change Short Film - Allu Arjun, Sukumar 20/10/2014

https://www.youtube.com/watch?v=ZkbQcayOsc0&index=2&list=UULiwEQsSEmXe4ShFVJk_hAQ&channel=MrBunnyonline

I Am That Change Short Film - Allu Arjun, Sukumar Watch the short film "I Am That Change" directed by Sukumar. Allu Arjun himself produced the short film. Cinematography : Amol Rathod , Music : Sai Kartheek ...

Want your school to be the top-listed School/college in Karimnagar?
Click here to claim your Sponsored Listing.

Address


Dharmaram
Karimnagar
505416