Kriya
30/12/2024
26/09/2024
02/08/2024
గతేడాది క్రియ నవోదయ, NMMS పరీక్షలకు విజిఎస్ స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఆంధ్ర ప్రదేశ్ లోని 458 ప్రభుత్వ పాఠశాలలలో 7388 మంది పిల్లలకు ఇచ్చాం.
863 నవోదయ తెలుగు మీడియం
516 నవోదయ ఇంగ్లీషు మీడియం
1205 NMMS తెలుగు మీడియం
4804 NMMS ఇంగ్లీషు మీడియం
7388 మెత్తం
చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం పది వేల పుస్తకాలు అవసరమౌతాయని అంచనా. ఖర్చు అంచనా పది లక్షలు.
ఎవరైనా వ్యక్తులు కాని, సంస్థలు కాని స్పందించ వలసినదిగా మనవి.
31/05/2024
ఈ సంవత్సరం క్రియ స్కాలర్షిప్ ల గురించి ఒక విషయం చెప్పాలి.
కల్యాణి నీలారంభం గారు రచయిత, అనువాదకురాలు, విశ్రాంత ఆంగ్ల అధ్యాపకురాలు, విజయవాడలో ఉండేవారు. గత సంవత్సరం ఆమెకు కలిగిన తీవ్ర అనారోగ్యం కారణంగా ఇంకెంతో సమయం లేదనే విషయం ఆమెకు అర్దమయింది. ఆవిడ సేవింగ్స్ మొత్తం పేద పిల్లల చదువుకు ఉపయోగపడాలని సేవా సంస్థలకు ఇచ్చేసారు. ఆ క్రమంలో వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారి ద్వారా క్రియ స్కాలర్షిప్ ల గురించి తెలుసుకుని యాభై వేలు క్రియ ఎకౌంటుకు బదిలీ చేసారు. తర్వాత కొద్దిరోజులకే తుది శ్వాస విడిచారు. ఆమె పార్దివ దేహాన్ని వైద్య కళాశాలకు ఆమె కోరిక మేరకు మిత్రులు అందజేసేరు.
ఈ మధ్యనే ఒక రచయితగా మరణానంతరం ఆమెకు మొల్ల పురస్కారం లభించింది. పురస్కార సభ 'యూ ట్యూబ్' లింక్ క్రింద ఇస్తున్నాను. వక్తలు మాటలు విన్నాక తెలిసింది నాకు ఆమె ఎంత గొప్ప వ్యక్తో.
https://youtu.be/RGz8XWYAUVU
30/05/2024
క్రియ స్కాలర్ షిప్స్ 2024:
ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల నుండి మంచి మార్కులతో పదవ తరగతి పాసయిన పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5000/- చొప్పున స్కాలర్ షిప్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
2011 నుంచి ఇప్పటి వరకు 620 విద్యార్ధులకు సుమారు 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది.
ఇందులో భాగం కాదలచినవారు స్పందించమని మనవి
గతంలో ఇచ్చిన స్కాలర్ షిప్స్ వివరాలు, ఫోటోలు వెబ్ సైట్లో ఉన్నాయి.
Kriya - Scholarships KRIYA gives scholarships to the poor and brilliant students of government schools to continue their studies after 10th class. Many children from poor families mainly in rural areas are studying up to 10th class easily as they have government school nearby and those schools offer free education and a...
Click here to claim your Sponsored Listing.
Contact the organization
Telephone
Website
Address
2-155, Mainroad, Thimmapuram
Kakinada
533005
28/12/2024