True Voice

True Voice

Share

24/05/2026

“మనుషుల పరిస్థితి బొద్దింకలకంటే దారుణం.. మరి ఈ మనుషుల బతుకులను ఎలా వర్ణించాలి న్యాయమూర్తి గారూ?” 😢⚖️

22/05/2026

మా నాన్న ఉత్తరం రాశాడు.. మా తాత కలలు కన్నాడు.. నేను రాత్రి ఆత్మలతో మాట్లాడి కంపెనీలు తెచ్చానని సొల్లు కబుర్లు చెప్పే ఎమ్మెల్యే ఉన్నాడు.

ఆ వ్యక్తికి ఒక్కటే చెప్తున్నా.. జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే, గొడ్డలి మీ బ్రాండ్..

22/05/2026

🚨 విజయవాడలో యువకుల రౌడీయిజం.. నడిరోడ్డుపై జీపులతో ఢీకొని బీభత్సం! 🚨

విజయవాడలో అర్ధరాత్రి ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
బాల్య స్నేహితులైన లింగమనేని రోహిత్, బొల్లా ఓం మధ్య ఒకరిపై ఒకరు తప్పుగా మాట్లాడుతున్నారనే కారణంతో గొడవ మొదలైంది.

📞 ఫోన్‌లో సవాళ్లు విసురుకుంటూ “తేల్చుకుందాం” అంటూ రోడ్డుపైకి వచ్చిన యువకులు…
🚙 వచ్చీ రావడంతోనే పరస్పరం జీపులతో ఢీకొట్టుకుని బీభత్సం సృష్టించారు.

👥 బొల్లా ఓం తో పాటు ఇద్దరు యువకులు కారులో రాగా, యువతితో కలిసి వచ్చిన లింగమనేని రోహిత్ కూడా అక్కడికి చేరుకున్నాడు.
కార్లు ఢీకొన్న వెంటనే కిందికి దిగి పరస్పరం దాడులకు దిగారు.

⚠️ ఈ ఘటనతో అక్కడున్న వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
టైర్ పంచర్ కావడంతో లింగమనేని రోహిత్ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం అతని కారుపై ఐరన్ రాడ్లతో దాడి చేసినట్లు సమాచారం.

👮 పోలీసులు బొల్లా ఓంతో పాటు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.
పరారీలో ఉన్న లింగమనేని రోహిత్ కోసం గాలింపు కొనసాగుతోంది.

Want your business to be the top-listed Advertising & Marketing Company in Kakinada?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Kakinada