SHO Jagtial Rural

SHO Jagtial Rural

Share

28/03/2025

వ్యవసాయ మోటర్ దొంగతనానికి ప్రయత్నించిన కేసులో నిందితునికి 6 నెలల జైలు శిక్ష మరియు 100 రూపాయల జరిమానా....

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతే గ్రామానికి చెందిన రైతు అనిల్ తేదీ: 03-01-2024 రోజున పొలం పనుల గురించి ఉదయం 10 గంటలకు వెళ్లగా పొలం దగ్గర ఎవరో గుర్తుతెలియని వ్యక్తి వ్యవసాయ మోటార్ దొంగిలిస్తున్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి పట్టుకోవడానికి ప్రయత్నించగా నిందితుడు అనిల్ ను గాయపరిచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల పొలంలో పనిచేస్తున్న వారు ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వ్యవసాయ మోటర్ దొంగతనానికి ప్రయత్నించడని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన జగిత్యాల రూరల్ ఎస్.ఐ సదకర్ తన సిబ్బందితో కలిసి వ్యవసాయ మోటర్ దొంగలించిన నిందితుడు ఫీరాజ్ గ్రామం ఉత్పల్లి,బోధన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరచడం జరిగింది. కోర్టు కానిస్టేబుల్ రామకృష్ణ సాక్షులను ప్రవేశపెట్టగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజని గారు తమ వాదన వినిపించగా నేరం రుజువు కావడంతో నిందితుడికి 6 నెలల జైలు శిక్ష,100 రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి శ్రీమతి శ్రీనిజ కోహిర్కర్ గారు తీర్పునిచ్చారు

13/03/2025

కన్న కూతురు(మైనర్ బాలిక) తో అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితునికి 3 సంవత్సరముల జైలు శిక్ష మరియు రూ 5000/- జరిమానా........

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిదికి చెందిన నిందితుడు మేకల స్వామి వయస్సు 36 సంవత్సరాలు అనే వ్యక్తి కన్నకూతురు(మైనర్ బాలిక) తో అసభ్య కరంగా ప్రవర్తించిన ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్.ఐ M.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి Fast track spl. Court కి ఆధారాలు సమర్పించగా పిపి గారు కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్ష్యులను ప్రవేశపెట్టగా, సాక్ష్యులను విచారించిన గౌరవ న్యాయమూర్తి శ్రీమతి నీలిమ గారు ఈ రోజున నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5000/- జరిమాన విదిస్తూ తీర్పునిచ్చారు.

20/02/2025
29/10/2024

లైసెన్స్, నిబంధనల మేరకే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు*

*- - - లైసెన్స్ లేకుండా విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు*

*- - - పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి*

దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులు దుకాణాలు నిర్వహించేవారు లైసెన్స్ ఉన్నవారు మాత్రమే నిబంధన మేరకే షాపులు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు సూచించారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుకాణాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనవాసాలు లేని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాకాయల షాపుల ఏర్పాటు చేసుకోవాలని అన్నరు. టపాసులను జనావాసాలలో ఎట్టి పరిస్థితుల్లో నిలువ చేయరాదని ఇలా నిలువ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు. దుకాణాల సమీపంలో ఇసుక, నీరు, ఫైర్‌ ఎక్స్‌ట్రిమిషన్‌లు ఉంచాలని సూచించారు. బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపావళి సందర్భంగా పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని పండగను ప్రశాంత వాతావరణoలో జరుపుకోవాలని సూచించారు.

01/07/2024

*- జులై 1 నుండి అమల్లోకి కొత్తచట్టాలు*

*- - -కొత్త చట్టాలపై విడతలవారీగా అధికారులకు, సిబ్బందికి శిక్షణ పూర్తి*

*- - - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు*

జూలై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు అమలులోకి రానున్నట్లు జిల్లా ఎస్పి పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. అమల్లోకి రానున్న కొత్త చట్టాలు మనదేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని పేర్కొన్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతులలో మార్పు వస్తుందని, ప్రజలకి మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.*కొత్తగా రూపొందించిన మూడు చట్టాలు - *భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్యా అధినియం.* జిల్లాలోని ఉన్న పోలీసు అదికారులకు , సిబ్బందికి విడతలవారీగా శిక్షణ కార్యక్రమని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగిందని, బాధిత వ్యక్తుల హక్కులను పరిరక్షించడం, నేరాల విచారణను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనుగుణంగా కొత్త క్రిమినల్ చట్టాలకు చాలా రూపొందించడం జరిగిందని అన్నారు. కొత్త చట్టాల వర్తింపు మరియు నేరాలు మరియు దానికి సంబంధించిన కేసులతో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని ఎలా గ్రహించాలనే దానిపై పోలీసు శాఖకు చెందిన డిఎస్పీ నుండి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

Want your organization to be the top-listed Government Service in Jagtial?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Jagtial
505327