Jeevan Reddy BRS
ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత రైతు కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. Jeevan Reddy BRS Kalvakuntla Taraka Rama Rao - KTR
20/06/2026
... ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు హిట్లర్ రెడ్డి
..హిట్లర్ రెడ్డి మోదీ,బాబు కనుసైగల్లో పని చేస్తుండు.
..పవన్ కళ్యాణ్ నీ సినిమాలు హిట్ అయినంత మాత్రాన నువ్వు ముఖ్యమంత్రి అయితా అనుకుంటే అది నీ భ్రమ
.. పాన్ డబ్బాల లెక్క పది పార్టీలు పుడితే అందులో ఒక తోక పార్టీ జనసేన పార్టీ
.. మా కౌన్సిలర్లకు ప్రోటోకాల్ ఇవ్వకుంటే 2000 మందితో మున్సిపాలిటీని ముట్టడిస్తాం.
… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు మిత్రుడు అయి రైతులకు రైతు బంధు ఇస్తే...రేవంత్ రెడ్డి బూతు బంధు అయ్యాడు
.. రైతుల పాలిట,ఉద్యోగులు, నిరుద్యోగుల పాలిట రేవంత్ రెడ్డి ఒక హిట్లర్ లా మారాడు
..రేవంత్ ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు ...హిట్లర్ రాజ్యంగా ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యంగా మార్చాడు.
.. బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతులకు రైతు బంధు,24 గంటల ఉచిత కరెంటు,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి.
.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరానికి రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తామని నిన్న కొత్త సర్క్యులర్ ఇచ్చారు.. ఆ రెండు కూడా ఒకటి ఈ నెలలో, ఇంకోటి వచ్చే నెలలో ఇస్తామంటున్నరు.
.. కేసీఆర్ గారి హయాంలో ఆటో డ్రైవర్లకు చెప్తే యూరియా ఇంటి దగ్గర వేసి పోయేవారు.
.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులంటే ఎందుకు ఇంత చిన్నచూపు ?
.. రైతుల మోచేతులకి బెల్లం పెట్టి కొనుగోలు చేస్తలేరు.
.. వడ్లను,మక్కలను,జొన్నలను కొనుగోలు చెయ్యకపోతే కాంగ్రెస్ నాయకుల ఇంటి ముందు రైతులతో కలిసి పారబోస్తం
..రేవంత్ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటన్న నేరవేర్చినవా
. నాడు ఆర్మూర్ లో ఎర్రజోన్నల డబ్బులు వ్యాపారులు రైతులకు ఇవ్వకపోతే వారి కోసం నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం రాగానే 13కోట్ల రూపాయలు ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్
…రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే రైతు డిక్లరేషన్‌ను బొందపెట్టిన రేవంత్ రెడ్డి.
.. ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో అన్ని పంటలు కొంటామని చెప్పి ఇప్పుడు కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని అంటున్నారు.
.. అనేక సందర్భాల్లో ఎంత పంట పండిస్తే అంత పంట కొంటామని చెప్పి ఈరోజు మాట మారుస్తున్నారు.
.. కేంద్రం చెప్పినట్టు వినడానికి నువ్వెందుకు, నీ ప్రభుత్వం ఎందుకు రేవంత్ రెడ్డి ?
.. షాప్ లో లేని యూరియా యాప్ లో ఎట్లా వస్తది హిట్లర్ ముఖ్యమంత్రి
… కాంగ్రెస్,బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడైన యూరియా యాప్ ఉందా..?
.. రైతులతో పెట్టుకున్నోడు...కేసిఆర్ తో గోక్కున్నోడు ఎవరూ మిగలలేరు.
..ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిట్లర్ రేవంత్ రెడ్డిని కూడా రైతులు పాతరేస్తరు..
.. ప్రభుత్వ అసమర్థత వల్ల 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు.దీనికి పూర్తి బాధ్యత హిట్లర్ రేవంత్ రెడ్డి వహించాలి
.. రైతులకు ఇచ్చిన ప్రతి హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ నాయకులను తరిమి తరిమి కొట్టాలి.
..రైతులకు బిఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు ఉంటుంది.
... ప్రెస్ మీట్ లో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
ఆర్మూర్, జూన్ 20: రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోందని, రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రైతుల సమస్యలపై స్పందిస్తూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు హిట్లర్ రెడ్డి అని, హిట్లర్ రెడ్డి మోదీ, బాబు కనుసైగల్లో పని చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటే అది భ్రమేనని అన్నారు. పాన్ డబ్బాల లెక్క పది పార్టీలు పుడితే అందులో ఒక తోక పార్టీ జనసేన పార్టీ అని విమర్శించారు. తమ కౌన్సిలర్లకు ప్రోటోకాల్ ఇవ్వకుంటే 2000 మందితో మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు రైతు మిత్రుడిగా రైతు బంధు అందిస్తే, రేవంత్ రెడ్డి బూతు బంధుగా మారారని అన్నారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల పాలిట రేవంత్ రెడ్డి ఒక హిట్లర్‌లా మారాడని విమర్శించారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని, హిట్లర్ రాజ్యంగా, ఎమర్జెన్సీ రాజ్యంగా మార్చారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. ఎకరానికి రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం కొత్త సర్క్యులర్ తీసుకువచ్చిందని, వాటిని కూడా విడతల వారీగా ఇస్తామని చెప్పడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కేసీఆర్ హయాంలో అవసరమైన ఎరువులు రైతుల ఇంటి వద్దకే చేరేవని గుర్తు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులంటే ఎందుకు ఇంత చిన్నచూపు అని ప్రశ్నించారు. రైతుల మోచేతులకు బెల్లం పెట్టి పంటలు కొనుగోలు చేయడం కుదరదన్నారు. వడ్లు, మక్కలు, జొన్నలు కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు రైతులతో కలిసి పంటలను పారబోస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్నల డబ్బులు రైతులకు అందకపోయిన సమయంలో రైతుల కోసం నిరాహార దీక్ష చేసి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.13 కోట్లు చెల్లింపులు జరిగేలా చేసిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే రైతు డిక్లరేషన్‌ను బొందపెట్టారని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో అన్ని పంటలు కొనుగోలు చేస్తామని చెప్పి, ఇప్పుడు కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని చెప్పడం మాట తప్పడమేనన్నారు.
ఎంత పంట పండితే అంత పంట కొనుగోలు చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పి, ఇప్పుడు మాట మార్చడం రైతులను మోసం చేయడమేనని ఆరోపించారు. కేంద్రం చెప్పినట్టు వినడానికే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. షాపులో లేని యూరియా యాప్‌లో ఎలా వస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా యూరియా యాప్ ఉందా అని ప్రశ్నించారు.
రైతులతో పెట్టుకున్నవారు, కేసీఆర్‌తో గోక్కున్నవారు ఎవరూ మిగలలేదని పేర్కొంటూ, రైతులు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
చివరిగా రైతులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు ఉంటుందని, రైతుల హక్కుల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు,పట్టణ అధ్యక్షులు పూజ నరెంధర్,మాజీ జడ్పిటిసి సంతోష్,పట్టణ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Hyderabad
500 ###, 501 ###, 502 ###.