Komatireddy Venkat Reddy
20/06/2026
నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి శ్రీ Anumula Revanth Reddy గారు త్వరలో రూ. 13,500 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధించి నేడు వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో జరుగుతున్న శంకుస్థాపన పైలాన్ పనులను పరిశీలించాను.
ఈ పైలాన్‌ను చిరస్మరణీయంగా, ప్రజలను ఆకర్షించేలా పచ్చదనం, రైలింగ్, త్రివర్ణ అలంకరణలతో అద్భుతంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించాను.
20/06/2026
నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దడమే నా ప్రధాన లక్ష్యం. అభివృద్ధి అంటే కేవలం భవన నిర్మాణాలు మాత్రమే కాదు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును మార్చడం.
ఈ రోజు నల్లగొండలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ మరియు ఒకేషనల్ కళాశాలలను సందర్శించడం జరిగింది. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును అందించే దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాము.
ఆగస్టు నాటికి నల్లగొండ నియోజకవర్గంలోని 40 ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పించి, మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతాము.
బొట్టుగూడ ప్రతీక్ పాఠశాలలో నెల రోజుల్లో 1 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ల్యాబ్ ను ప్రారంభిస్తాము.
ప్రతీక్ స్కూల్ లో పదవ తరగతిలో 95 శాతం పైన మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నా సొంత ఖర్చులతో విమానంలో ఢిల్లీ పర్యటనకు తీసుకువెళ్తాను.
జిల్లా వ్యాప్తంగా పదవ తరగతిలో 95 శాతం పైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఇంటర్, ఐఐటీ, మెడిసిన్ కోచింగ్ కోసం ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తాము.
త్వరలోనే హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో పాఠశాల పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటాము.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీలు సాధించాలన్నదే నా ఆకాంక్ష. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి ప్రత్యేక శ్రద్ధతో విద్యాబుద్ధులు నేర్పాలి. జూనియర్, ఒకేషనల్ కళాశాలల్లో ఉన్న గదుల కొరతను కూడా అధికారులతో సమన్వయం చేసుకొని త్వరలోనే పరిష్కరిస్తాము.
19/06/2026
ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ గారి తండ్రి శ్రీ యాదయ్య గౌడ్ గారు మృతి చెందడం అత్యంత విచారకరం.
వనస్థలిపురంలో యాదయ్య గౌడ్ గారి భౌతిక కాయానికి నివాళులర్పించి, అంతిమ యాత్రలో పాల్గొనడం జరిగింది.
పితృవియోగంతో బాధపడుతున్న రామ్మోహన్ గౌడ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. శ్రీ యాదయ్య గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
19/06/2026
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో కేంద్ర మంత్రి శ్రీ Kishan Reddy Gangapuram గారితో కలిసి రూ.30 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన 22 కిలోమీటర్ల ఆర్‌సీఐ గేట్ - మీర్‌ఖాన్‌పేట్ ప్రధాన రహదారిని ఈరోజు ప్రారంభించడం జరిగింది.
రావిర్యాల, కొంగరకలాన్, తిమ్మాపూర్, మాదాపూర్, గుమ్మడవల్లి, ఆకుల మైలారం గ్రామాల మీదుగా వెళ్లే ఈ విశాలమైన రహదారి ద్వారా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన, సురక్షితమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Address
Telangana
Hyderabad
508001