Vanga Madhusudhan Reddy

Vanga Madhusudhan Reddy

Share

21/06/2026

నాన్న.. పేదల జీవితాల్లో మార్పు కోసం, చంపాపేట్ డివిజన్ అభివృద్ధి కోసం మీరు చేసిన కృషి అనన్యసామాన్యం. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, నిత్యం సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన మీ జీవితం నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న...

21/06/2026

పదవులు అలంకారప్రాయం… ప్రజా సేవే అసలైన ధ్యేయం అనే నమ్మకంతో మా తండ్రి గారైన వంగ మధుసూదన్ రెడ్డి గారు కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం 24×7 ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో అండగా నిలిచారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి తోడుగా నిలిచి, సేవాభావానికి నిదర్శనంగా ప్రజల మన్ననలు పొందారు.

20/06/2026

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

సాధారణ నేపథ్యం నుంచి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవైన రాష్ట్రపతి భవన్ వరకు ఆమె సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణం నవ భారత ఆశయాలకు ప్రతీకగా నిలిచింది. మహిళా సాధికారతకు, ఆదివాసీ సమాజ అభ్యున్నతికి ఆమె ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆమెకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, దేశ సేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. కలియుగ దైవం కర్మాన్ ఘాట్ హరిహరక్షేత్రం అయ్యప్ప స్వామి వారి కరుణాకటాక్షాలు ఆమెపై ఎల్లప్పుడూ ఉండాలని, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవను కొనసాగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

20/06/2026

భారత రాష్ట్రపతిగా నిరాడంబరతకు, మహిళా సాధికారతకు, ఆదివాసీ సమాజ అభ్యున్నతికి ప్రతీకగా నిలిచిన గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది మూర్ము గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

దేశానికి ఆమె అందిస్తున్న విశిష్ట సేవలు, రాజ్యాంగ విలువల పరిరక్షణలో ఆమె చూపుతున్న అచంచల నిబద్ధత, సమర్థవంతమైన నాయకత్వం, మార్గదర్శకత్వం నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

కలియుగ దైవం కర్మాన్ ఘాట్ హరిహరక్షేత్రం అయ్యప్ప స్వామి వారి కరుణాకటాక్షాలు ఆమెపై ఎల్లప్పుడూ ఉండాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షుతో ప్రజాసేవను కొనసాగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

19/06/2026

పార్లమెంట్ ఎన్నికల్లో LB నగర్ నియోజకవర్గంలో బీజేపికి వచ్చిన మెజారిటీ 1,15,000 ఓట్లు , LB నగర్ ప్రజలు బీజేపి పార్టీని తమ పార్టీగా భావిస్తున్నారు..ఇప్పుడు కూడా అన్ని కార్పొరేటర్ స్థానాలు మేమే గెలుస్తాం..

15/06/2026

వనస్థలిపురంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించనున్న “నమో యువ కాంక్లేవ్” కార్యక్రమానికి సంబంధించి సన్నాహక సమావేశంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు శ్రీ వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, వంగా సిద్ధాంత్ రెడ్డి గారు, నమో యువ కాంక్లేవ్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ శ్రీ పొట్లపల్లి సాయిరామ్ గౌడ్ గారు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మల్కా యశస్వి గారు మరియు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి చాడ అనితా రెడ్డి గారు, పాల్గొన్నారు.

15/06/2026

స్వామియేశరణం.. అయ్యప్ప శరణం అంటూ నిత్యం కర్మాన్ ఘాట్ హరిహర క్షేత్రం అయ్యప్పస్వామి ఆలయం మారుమోగుతుంది అంటే దానికి కర్త, కర్మ, క్రియ మన వంగా మధు సూదన్ అన్న గారే..

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Karmanghat X Road
Hyderabad