Real Estate
Looking for seriously working Real Estate team leaders...
Contact
Y K Rao
Sr Director
Srigdha Group Projects
+918919916405
16/09/2024
ఇదే సరైన టైం.. హైదరాబాద్‌లో ఇల్లు, భూమి ఇప్పుడే ఎందుకు కొనాలంటే?
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం వచ్చే పదేళ్లలో మరింత విస్తరిస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా, క్రెడాయ్ నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 482 బిలియన్ డాలర్లు ఉండగా.. అంది 2034 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అంటే రానున్న రోజుల్లో గృహ నిర్మాణాలకు, ఆఫీసులకు, గెస్ట్ హౌస్‌లకు మంచి డిమాండ్ ఉంటుందని అర్థమవుతోంది. జనాభా పెరగడం, నగరాలకు వసలు, ఆదాయాలు పెరగడమే ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగానే మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయని, ఇల్లు, స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని స్థిరాస్తి రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి నుంచే అన్వేషన ప్రారంభిస్తే దసరా నాటికి నచ్చిన ఇల్లు లేదా భూమి కొనొచ్చంటున్నారు.
రియల్ ఎస్టేట్‌లో కొద్ది మంది మాత్రమే పెట్టుబడి పెడుతుంటారు. చాలా మంది సొంత అవసరాల కోసం కొనుగోలు చేస్తుంటారు. ఇల్లు, విల్లాలు, ఫ్లాట్లు, భవిష్యత్తు కోసం వెంచర్లలో స్థలాలు కొంటారు. ఇవన్నీ దీర్ఘకాలిక అవసరాలు. అందుకే మార్కెట్లతో సంబంధం లేకుండా స్తబ్దుగా ఉన్నప్పుడే కొనుగోలు చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. మార్కెట్ స్తబ్దుగా ఉన్నప్పుడు డెవలపర్‌తో బేరమాడేందుకు అవకాశం లభిస్తుందని, రాత్రికి రాత్రే ధరలు పెంచే పరిస్థితులు ఉండవంటున్నారు. ఇలాంటి మార్కెట్ స్తబ్దుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొనడం ద్వారా కాస్త ధర తగ్గించేందుకు, పేమెంట్లు చేసేందుకు గడువు ఇచ్చేందుకు అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ స్తబ్దుగా ఉందంటే ముందు ముందు ధరలు పెరుగుతాయని అంచనా వేయవచ్చని చెబుతున్నారు. అలాంటి పరిస్థితులు రాకముందే కొనుగోలు చేయాలంటున్నారు.
అలాగే ఫ్లాట్లు, విల్లాలు మాత్రమే కాకుండా వెంచర్లలోనూ స్థలాలు కొనేందుకు ఇది ఒక మంచి సమయం అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ప్రభుత్వం కొత్తగా మౌలిక వసతులు ఎక్కడ ఏర్పాటు చేయనుంది, భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉన్న స్థలాలు గుర్తిస్తూ నిపుణుల సలహాలు తీసుకుని కొనుగోలు చేయాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో కొంత కాలం పాటు మార్కెట్ అనేది స్తబ్దుగానే ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగిన దాఖలాలు ఉన్నాయి. ఈ ధోరణి 2000 సంవత్సరం నుంచి చూడవచ్చు. 2005లో తెలంగాణ ఉద్యమం సమయంలో, కరోనా వచ్చిన సమయంలో మార్కెట్ తగ్గి ఆ తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది. ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే వచ్చే 6-12 నెలల్లో బాగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. స్థిరాస్తుల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడే కొనుగోలు చేయండ మేలంటున్నారు.
29/08/2024
హైదరాబాద్ లో అక్కడ గజం రూ.10లక్షలు.. ఎక్కడంటే?
మీరు చదివింది అక్షరాల నిజం. ఒక గజం ధర ఎంత ఉంటుంది? అంటే.. ఎవరికి వారు వారికి తోచిన లెక్క చెప్పొచ్చు. కానీ.. ఎవరూ కూడా రూ.10 లక్షలు ఉంటుందని మాత్రం చెప్పలేరు. అయితే.. హైదరాబాద్ మహానగరంలోని ఒక ప్రాంతంలో గజం రూ.10లక్షల చొప్పున 101 గజాల స్థలాన్ని ఏకంగా రూ.10 కోట్లకు అమ్మిన వైనం సంచలనంగా మారింది. ఇప్పటివరకు హైదరాబాద్ లో ఎకరం రూ.వంద కోట్లుగా విన్నాం. కానీ.. గజం రూ.10 లక్షలు మాత్రం విన్నది లేదు. ఈ సరికొత్త రికార్డుకు కేరాఫ్ అడ్రస్ బేగంబజార్ నిలిచింది.
హైదరాబాద్ మహానగరంలో అన్ని రకాల హోల్ సేల్ వ్యాపారాలకు నెలవుగా ఉండే బేగంబజార్ లో ఈ తాజా క్రయ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. పాతబస్తీ పరిధిలోని బేగంబజార్ ఫీల్ ఖానాలోని 101 గజాల స్థలాన్ని రూ.10 కోట్లకు కొనుగోలు చేసిన వ్యాపారి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో తెలంగాణలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్ గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లోని హోల్ సేల్ వ్యాపార మార్కెట్లకు బేగం బజార్ అడ్రస్ గా చెబుతారు. వాణిజ్య మార్కెట్ లో దేశ ఆర్థిక రాజధాని ముంబయితో పోటీ పడే సత్తా బేగంబజార్ సొంతం. ఈ ప్రాంతంలోమహారాష్ట్ర.. గుజరాత్.. రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్.. మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఉంటారు. ఈ బజార్ లో కొనుగోళ్ల కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తుంటారు.
ఇక్కడ.. భూమి ఉన్న వారు.. సొంత నివాసాలు ఉన్న వారిలో అత్యధికులు తమ ఆస్తుల్ని అమ్మేందుకు సుతారం ఇష్టపడరు. దీంతో.. ఆస్తులకు భారీ డిమాండ్ ఉంది. ఎంతకైనా కొనేస్తామన్నట్లుగా ఉంటుంది. ఈ కారణంగానే.. తాజా రికార్డు కొనుగోలు సాధ్యమైందని చెబుతున్నారు. ఈ ప్రాంతం మొత్తంలో ఉత్తరాది వారిదే అధిక్యతగా చెప్పాలి. వ్యాపార వర్గాలు భారీగా ఉండే.. ఈ ప్రాంతంలో రానున్నరోజుల్లో ధరలు మరిన్ని రికార్డులను నమోదు చేయటం ఖాయమని చెబుతున్నారు.
https://www.tupaki.com/latest-news/land-rate-in-hyderabad-1381739
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
LB Nagar
Hyderabad
500068