CN Reddy Corporator

CN Reddy Corporator

Share

Photos from CN Reddy Corporator's post 22/06/2026

జూబ్లీహిల్స్ నియోజకవర్గం
SIR శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న CN REDDY

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలు మరియు BLAs (బూత్ లెవల్ ఏజెంట్స్) కోసం GHMC ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారి ఆదేశాల మేరకు నేడు సోమవారం 22-06-2026 నాడు సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన Special Intensive Revision (SIR) శిక్షణ కార్యక్రమంలో CN REDDY పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ప్రతి కార్యకర్త పాత్ర కీలకం. SIR ప్రక్రియ ద్వారా ఓటరు జాబితా పరిశుద్ధం అవుతుంది. ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతగా పని చేసి, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూసుకోవాలి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఇదే పునాది" అని అన్నారు.

ఈ కార్యక్రమం లో MRO ప్రేమాకుమార్ గారు యూసఫ్గుడ సర్కిల్ డీసీ సురేష్ గారు,బోరబండ సర్కిల్ డీసీ,ఉమా గారు AMC బాలరాజ్ గారు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, BLAs హాజరై శిక్షణ పొందారు.

Photos from CN Reddy Corporator's post 22/06/2026

జూబ్లీహిల్స్ నియోజకవర్గం, రహమత్‌నగర్ డివిజన్
వినాయక్ నగర్‌లో రూ.40 లక్షలతో నూతన CC రోడ్డు పనుల పరిశీలన

జూబ్లీహిల్స్ నియోజకవర్గం, రహమత్‌నగర్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్‌లో రూ.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన CC రోడ్డు పనులను C.N. REDDY గారు పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, _"ప్రభుత్వ నిధులతో చేపట్టిన ప్రతి పనిలోనూ నాణ్యత ప్రధానం. వినాయక్ నగర్ బస్తి వాసుల చిరకాల కోరిక మేరకు ఈ CC రోడ్డు పనులు చేపట్టడం జరిగింది. నిర్దేశించిన సమయంలోపే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో AE ముజామిల్ గారు, వర్క్ ఇన్‌స్పెక్టర్ వణిదర్ గారు, కాంట్రాక్టర్ అనిల్ గారు, బస్తి వాసులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

21/06/2026

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన CN REDDY గారు

హైదరాబాద్: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారి జన్మదినం సందర్భంగా CN REDDY గారు వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

21/06/2026

అంతర్జాతీయ "యోగా" దినోత్సవ శుభాకాంక్షలు

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Rahamath Nagar
Hyderabad
500045