Challa Narasimha Reddy
06/04/2025
సకల గుణాభిరాముడు, పితృవాక్య పరిపాలకుడు, మనందరికీ ఆదర్శప్రాయుడు ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
01/04/2025
ఢిల్లీ : AICC అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మప్పన మల్లికార్జున ఖర్గే గారిని & AICC జనరల్ సెక్రటరీ శ్రీ కేసి వేణుగోపాల్ గారిని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు / రాష్ట్ర TUFIDC కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చల్లా నరసింహారెడ్డి గారు...
31/03/2025
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్. నెలరోజుల ఉపవాసదీక్షను ముగించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు.
30/03/2025
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి భాషా సాంస్కృతిక శాఖ & దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క, మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి, శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి, శ్రీ వీర్లపల్లి శంకర్ గార్లతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర TUFIDC కార్పొరేషన్ చైర్మన్ & రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ చల్లా నరసింహారెడ్డి గారు...
21/03/2025
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబరచి అద్భుతమైన ఫలితాలను సాధిస్తారని ఆశిస్తున్నాము.
All the best 👍
17/03/2025
*ఉపవాసం భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఓ మార్గం*
*రాష్ట్ర TUFIDC కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చల్లా నరసింహారెడ్డి గారు*
*చార్మినార్ నియోజకవర్గంలో కాంటెస్టడ్ ఎమ్మెల్యే ముజీబ్ ఉల్లా షరీఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ & మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు శ్రీ మొహమ్మద్ షబ్బీర్ అలీ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని మరియు రాష్ట్ర TUFIDC కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చల్లా నరసింహ రెడ్డి గారు..*
ఇస్లాం మతం ప్రకారం రంజాన్ మాసంలో ఉపవాసం చేసే వారు భగవంతుని అనుగ్రహం పొందుతారని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం చార్మినార్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న, అనంతరం మాట్లాడారు ఇఫ్తార్ విందులో తోటి వారికి కూడా భోజనాన్ని అందించడం సంప్రదాయమని, సూర్యస్త సమయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మంచినీళ్లు, ఖర్జూర పండును తిని ఉపవాస దీక్షను విరమించడం రంజాన్ మాసం ఒక్క సంప్రదాయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు భిన్నత్వంలో ఏకత్వంలా, మతాలకతీతంగా పర్వదినాలను జరుపుకోవడం ఇక్కడి సంస్కృతి అని అభిప్రాయపడ్డారు. ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసేందుకు శ్రీ ముజీబ్ ఉల్లా షరీఫ్ గారు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. మరియు ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ మెంబర్ నాగేందర్, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్, పిసిసి స్పోక్స్ పర్సన్ నిజాముద్దీన్, హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అమన్ ఉల్లా షరీఫ్, పురాణపుల్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అస్లాం షరీఫ్, మరియు నియోజకవర్గ ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
17/03/2025
మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన జిల్లా ఇన్చార్జి మంత్రి & శాసనమండలి చీఫ్ విప్ మరియు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్, వైస్ చైర్మన్ సి హెచ్ యాదయ్య మరియు పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం సోమవారం మహేశ్వరం మార్కెట్ యార్డు ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే కిచ్ఛాన్న గారి లక్ష్మారెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఐటి & పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు, శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, రాష్ట్ర TUFIDC కార్పొరేషన్ చైర్మన్ & జిలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చల్లా నరసింహారెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీమతి తీగల అనిత రెడ్డి గారు, ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ మహేశ్వరం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సభ్యులకు అభినందనలు తెలిపి వ్యవసాయ దారులకి అండగా ఉండాలని అన్నారు, బి ఆర్ ఎస్ కేవలం మాటలకే పరిమితం అయిందని, కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పరిపాలన కొనసాగిస్తుందని వారు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు దశలవారీగా నెరవేరుస్తూ ప్రజల విశ్వాసం పొందుతూ ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad
500035