PTLU
ఈరోజు చాలా దారుణమైన సంఘటన జరిగింది. శ్రీ వివేకానంద స్కూల్,
రామచంద్రపురం,
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి తరగతి గదిలోని కుప్పకూలి చనిపోవడం జరిగింది. యాజమాన్యాలు అనారోగ్య సమస్యలతో చనిపోయింది అని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మరొక కోణం ఏమిటంటే ఈ స్కూల్ యాజమాన్యం చదువులు పేరుతో విద్యార్థులను విపరీతంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆదివారాలు సెలవు రోజుల్లో కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, మిగతా రోజుల్లో సాయంత్రం 7:00 వరకు కూడా తరగతులు నిర్వహిస్తూ పిల్లలకి ఏ మాత్రం ఆటలు గాని, విరామం గానీ లేకుండా ఒత్తిడికి గురి చేస్తున్నారు. దాని కారణంగానే ఆ విద్యార్థి ఆ ఒత్తిడిని భరించలేక చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నాము. వీళ్లే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేటు విద్యాసంస్థ యాజమాన్యాలు వాళ్ళ అడ్మిషన్లు పెంచుకోవడం కోసం పిల్లలను వ్యాపారవస్తులాగా భావించి అధిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. దయచేసి దీని పైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ తరపున డిమాండ్ చేస్తున్నాము.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Website
Address
Eluru
534002