Lakshman M

Lakshman M

Share

29/03/2026

నవ్యాంధ్ర భవిష్యత్తుకు పునాది అయిన అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించేలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు తీసుకొచ్చిన చారిత్రాత్మక తీర్మానాన్ని బిజెపి ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తుంది . ఇది కేవలం ఒక నిర్ణయం కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కీలక అడుగు. ఈ తీర్మానంలో ముఖ్యంగా అమరావతిని ఏకైక, శాశ్వత రాజధానిగా స్పష్టంగా ప్రకటించడం, రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు, రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు తగిన సవరణలు చేయాలని కోరుతూ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. గతంలో ఉన్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ, ఇప్పుడు స్పష్టతతో ముందుకు సాగేందుకు ఈ తీర్మానం బలమైన పునాది వేస్తోంది. ఈ సందర్భంలో సీఎం Nara Chandrababu Naidu గారు తీసుకున్న ఈ నిర్ణయం సమయోచితం మరియు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరం.

ఇక అమరావతి నిర్మాణం విషయానికి వస్తే, ప్రారంభం నుంచే శ్రీ Narendra Modi గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచింది. 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించగానే డీపీఆర్ లేకుండానే ₹2500 కోట్లు మంజూరు చేయడం, 2024లో ₹15,000 కోట్ల భారీ నిధులు అందించడం, HUDCO ద్వారా ₹11,000 కోట్ల రుణ సదుపాయం కల్పించడం, ₹2,245 కోట్లతో అమరావతికి రైల్వే లైన్ ప్రాజెక్ట్‌ను మంజూరు చేయడం, నూతన గ్రీన్ఫిల్డ్ జాతీయ రహదారుల ప్రాజెక్టులతో అమరావతిని దేశంలోని ప్రధాన పట్టణాలతో అనుసంధానించటానికి చర్యలు చేపట్టడం, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల విస్తరణ ద్వారా అమరావతి అభివృద్ధికి నిరంతర మద్దతు కొనసాగుతోంది.

బిజెపి ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక, భవిష్యత్తు తరాలకు ఆశ. ఇప్పుడు మనందరి బాధ్యత అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడం, పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు అవకాశాలు సృష్టించడం. అమరావతి అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.

Bharatiya Janata Party (BJP)
Nitin Nabin
BJP Andhra Pradesh

22/03/2026

Heartiest congratulations to Hon’ble Prime Minister Shri Narendra Modi ji on achieving the historic milestone of becoming the longest-serving head of government in India’s history, completing 8,931 days in service to the nation.

This extraordinary achievement reflects his dedication, visionary leadership, and tireless commitment to the progress and prosperity of our country. His vision of a Viksit Bharat by 2047 continues to inspire us all and guide India toward a brighter future.

Wishing him continued strength, good health, and success as he leads the nation to even greater heights.

21/03/2026

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) ద్వారా ఆకలి రహిత గుంటూరు జిల్లా రూపుదిద్దుకుంటోంది!

16/03/2026
16/03/2026

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బిజెపి రాష్ట్ర కార్యాలయ ఇంచార్జి, ప్రముఖ న్యాయవాది శ్రీ ఉప్పలపాటి శ్రీనివాస్ రాజు గారికి హృదయపూర్వక అభినందనలు.💐💐
BJP Andhra Pradesh
Lakshman Mekala

Want your public figure to be the top-listed Public Figure in Eluru?
Click here to claim your Sponsored Listing.

Category

Culinary Team

Attire

Telephone

Website

Address


Eluru
522303