Kandi Srinivasa Reddy

Kandi Srinivasa Reddy

Share

18/05/2026

“Happy birthday to my daughter Arika, who changed my world!"

Photos from Kandi Srinivasa Reddy's post 17/05/2026

రాజీవ్ జ్యోతీ యాత్ర‌కు స్వాగ‌తం ప‌లికిన కాంగ్రెస్ శ్రేణులు
రాజీవ్ గాంధీ సేవ‌ల‌ను కొనియాడిన కంది శ్రీ‌నివాస రెడ్డి గారు

స్వ‌ర్గీయ మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేవని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస రెడ్డి గారు అన్నారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ నుండి ఢిల్లీలోని వీర భూమి వరకు సాగుతున్న రాజీవ్ గాంధీ జ్యోతి యాత్ర ఆదివారం ఆదిలాబాద్ కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ప‌ట్ట‌ణంలోని డీసీసీ కార్యాల‌యంలో మార్కెట్ క‌మిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి , మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి గార్లతో పాటు కాంగ్రెస్ శ్రేణుల‌తో క‌లిసి ఆయ‌న జ్యోతీ యాత్ర‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.1984 నుండి 1989 వ‌ర‌కు ప్ర‌ధానిగా దేశంలో ఐటీ విప్లవానికి నాంది పలికిన గొప్ప మ‌హానీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరనిలోటని అన్నారు. ఆయ‌న మెమోరియ‌ల్ యాత్ర‌ను ప్ర‌తీ సంవ‌త్స‌రం నిర్వహిస్తున్న శామ్యూల్ ద్రవ్యమ్ గారికి ఆయన బృందానికి అభినందనలు తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశ‌యాల‌ను ఆయ‌న సిద్దాంతాల‌ను ముందుకు తీస‌కెళ్ల‌తామ‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న యాత్ర‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం గొప్ప గౌర‌వంగా భావిస్తున్నామ‌న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కిజర్ పాషా, నాయ‌కులు బెజ్జంకి అనిల్ ,మోతిరామ్ ,గౌలి సంజయ్ ,పరమేశ్వర్ , శ్రీకర్ గౌడ్ ,కుదురుపాక సురేష్ , కోలా న‌ర్సింలు , తొడసం దౌలత్ రావు,ష‌కీల్, ర‌ఫీక్ , సురేంద‌ర్, డేరా కృష్ణా రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Want your public figure to be the top-listed Public Figure in Adilabad?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Adilabad