Telugu Desam Qatar

Telugu Desam Qatar

Share

Photos from Telugu Desam Qatar's post 28/05/2026

దోహా, ఖతార్:

NRI TDP Qatar Core Committee ఆధ్వర్యంలో, మద్దిపోటి నరేష్ నాయకత్వంలో ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు మరియు మినీ మహానాడు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దోహాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బిజినెస్ మీట్‌లో మంత్రి పార్థసారథి ఖతార్‌లోని భారతీయ వ్యాపారవేత్తలు, తెలుగు పారిశ్రామికవేత్తలు, స్థానిక ఖతారీ బిజినెస్ ప్రతినిధులు మరియు ఎన్నారై ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ, డేటా సెంటర్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు మరియు భవిష్యత్ పారిశ్రామిక విధానాలపై ఆయన సమగ్రంగా వివరించారు.

రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అమరావతిలో ప్రతిష్టాత్మక “క్వాంటమ్ వ్యాలీ” ప్రాజెక్ట్ ద్వారా అత్యాధునిక టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధి, భారీ డేటా సెంటర్ల ఏర్పాటు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షణ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని వివరించారు.

మంత్రి ప్రసంగానికి భారతీయ మరియు ఖతారీ వ్యాపార వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపార భాగస్వామ్యాలను విస్తరించేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన పలువురు బిజినెస్ ప్రతినిధులు ఈ సమావేశాన్ని ఎంతో సానుకూలంగా అభివర్ణించారు.

Ultimate Groups జనరల్ మేనేజర్ శక్తివేల్, RISE Group ప్రతినిధులు సహా పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు సమావేశంలో పాల్గొని, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేశారు.

ఈ సమావేశం అనంతరం ఈద్ పండుగ తర్వాత మరిన్ని వ్యాపార సమావేశాలు, పెట్టుబడి చర్చలు మరియు ప్రతినిధి బృందాల సందర్శనలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఖతార్ – ఆంధ్రప్రదేశ్ మధ్య వ్యాపార, పారిశ్రామిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మద్దిపోటి నరేష్, గోపాలకృష్ణ చౌదరి, విక్రమ్ సుఖవాసి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలుగు సంఘాల ప్రతినిధులు, ఎన్నారై నాయకులు, వ్యాపారవేత్తలు మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఖతార్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు 23/05/2026

మన సమావేశాన్ని అపూర్వ విజయంగా మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు 🙏✨

మీ అందరి అంకితభావం, నిస్వార్థ సేవ, సమిష్టి కృషి మరియు అపారమైన సహకారం ఈ కార్యక్రమాన్ని మహత్తర విజయశిఖరాలకు చేర్చాయి.
మన ఐకమత్యం, పరస్పర విశ్వాసం, ఒకరిపై ఒకరికి ఉన్న ఆత్మీయత ఈ విజయానికి అసలైన బలస్తంభాలు.

ఈ ఘనవిజయం కేవలం ఒక కార్యక్రమం విజయమే కాదు…
మన బలమైన బంధానికి, మన అచంచల సంకల్పానికి, మన ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం ❤️

ఇలాగే మనందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ మరెన్నో చరిత్రాత్మక విజయాలను సృష్టించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను 💐

https://www.eenadu.net/telugu-news/nri/ntrs-birth-anniversary-celebrated-in-qatar/1101/126090278

ఖతార్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి, దివంగత నేత నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు, మినీ మహానాడు దోహాలో ఎన్నారై ...