Mekapati Vikram Reddy

Mekapati Vikram Reddy

Share

01/05/2026

మే డే శుభాకాంక్షలు

ప్రపంచ కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
మన సమాజ నిర్మాణానికి, అభివృద్ధికి తమ శ్రమతో బలమైన పునాది వేస్తున్న ప్రతి కార్మికుడికి నా హృదయపూర్వక వందనాలు.

కార్మికుల హక్కులు కాపాడుతూ, వారి సంక్షేమం కోసం కట్టుబడి పనిచేయడం మన అందరి బాధ్యత.
శ్రమకు గౌరవం, కార్మికులకు భద్రత, సంక్షేమం కలగాలని ఆకాంక్షిస్తూ....

మీ
-- మేకపాటి విక్రమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆత్మకూరు నియోజకవర్గం

28/04/2026

రాష్ట్రంలో ఇంధనాల కొరత తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రజల జీవన విధానం దెబ్బతింటోంది. వేసవి సెలవుల సమయంలో విద్యార్థుల రాకపోకలు, వరికోతల కాలంలో రైతుల వ్యవసాయ పనులు, అత్యవసర సేవల నిర్వహణ వంటి కీలక రంగాలు ఇంధన కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల సరఫరా అంతరాయం కలగడం వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో పాటు రైతులు తమ పంటల కోత, రవాణాలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, నీటిపారుదల మోటార్ల వినియోగం తగ్గిపోవడం వల్ల వ్యవసాయ కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే అంబులెన్స్ సేవలు, పాలు, కూరగాయల రవాణా వంటి అవసరమైన సేవలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించి, నిల్వలను పెంచి, సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించాలి.

అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి.

ఇంధన కొరతను నివారించడంలో ప్రభుత్వం విఫలమైతే రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా తక్షణ చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత.

16/04/2026

మావిగన్ పై చర్చకు సిద్దమా...?

05/04/2026

కార్మికుల హక్కుల కోసం, రైతుల సంక్షేమం కోసం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప నాయకుడు, తొలి ద‌ళిత ఉప ప్ర‌ధాని బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు.

Photos from Mekapati Vikram Reddy's post 19/03/2026

“అన్నదాతలను ఆదుకోండి”

వర్షాలు, వడగళ్ల వానతో అనంతసాగరం మండలంలోని పలు గ్రామాల్లో పంటలు నాశనం అయ్యాయి.

అనంతసాగరం మండలం మంగుపల్లి, కామిరెడ్డిపాడు, చిలకలమర్రి, గుడిగుంట తదితర గ్రామాల్లో వరి, మిరప పత్తి పంటలు పూర్తిగా నాశనం అయ్యాయి.

కోతకు వచ్చిన వరిపంట గింజలు నేలవాలి దిగుబడి తగ్గిపోయి రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి.

రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారు. అరుగలం శ్రమించి సాగు చేసిన పంట చేతికి అంది వచ్చిన సమయానికి ప్రకృతి కోపానికి రైతులు నష్టపోతున్నారు.

ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించాలి. దెబ్బతిన్న పంటలను పరిశీలించి
రైతు కష్టాన్ని అర్థం చేసుకుని వెంటనే నష్టపరిహారం అంచనా వెయ్యాలి.

నష్టపరిహారం, పంట బీమా డబ్బులు ఆలస్యం లేకుండా రైతు చేతికి అందాలి.

అన్నదాత కన్నీళ్లు కారితే ఆ బాధ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిందే. రైతు బలహీనపడితే వ్యవస్థ మొత్తం బలహీన పడుతుంది.

19/03/2026

తెలుగు ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
మన నేల పంటలతో పుష్కలంగా ఉండాలని, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇంట్లో ఆనందంవల్లివిరియాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాాను.

తెలుగు నూతన సంవత్సరాది అందరికి ఆరోగ్యం, అభివృద్ది, సుభిక్షం తీసుకురావాలి.

మీ అభివృద్దే నా లక్ష్యం... మీ సేవలో ఎప్పుడూ ముందుంటాను. మరొకసారి అందరికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు

Want your public figure to be the top-listed Public Figure in Nellore?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Nellore
Nellore