Connect With TGB
08/12/2025
42వ వార్డులో వార్డు పర్యటన చేపట్టిన మంత్రి టీజీ భరత్ గారు ..
▪️ఆర్థిక ఇబ్బందులు అధిగమించి సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు.
▪️కర్నూలు నగరంలోని 42వ వార్డులో ఆయన వార్డు పర్యటన చేపట్టి ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలిసి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. ఈ వార్డులో మొత్తం 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామన్నారు. మరో కోటిన్నర రూపాయల పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు..
▪️కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా చేపట్టి ముందుకు తీసుకెళుతున్నట్లు మంత్రి టీజీ భరత్ ప్రజలతో చెప్పారు. ప్రజలకు వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న తమ నాయకుల ద్వారా తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నామన్నారు,, పర్యటనలో యువతను కలిసి ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళా లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
▪️ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, టిడిపి నేతలు, బూత్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.
Click here to claim your Sponsored Listing.