Kotla Jayasurya Prakash Reddy
09/07/2026
*గూటుపల్లి రైతులకు భారీ ఊరట..!*
🔸22ఏ నిషేధిత జాబితా నుంచి 2074.59 ఎకరాల భూములకు విముక్తి..
🔸బేతంచర్ల మండలం గూటుపల్లి గ్రామ పరిధిలోని
142 సర్వే నంబర్లకు చెందిన రైతుల చిరకాల సమస్యకు పరిష్కారం...
🔸ప్రభుత్వం జారీ చేసిన **జీవో నెం.77**తో భూములపై ఉన్న నిషేధాలు తొలగింపు
🔸రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు, భూ లావాదేవీలలో
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం...
🎋*రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం*..
08/07/2026
*గూటుపల్లి రైతులకు భారీ ఊరట.. 22ఏ నిషేధిత జాబితా నుంచి 2074.59 ఎకరాల భూములకు విముక్తి*
నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బేతంచర్ల మండలం గూటుపల్లి గ్రామ రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. గ్రామ పరిధిలో గత కొన్నేళ్లుగా 22ఏ నిషేధిత భూముల జాబితాలో కొనసాగుతున్న 2074.59 ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జీవో నెం.77ను బుధవారం జారీ చేసింది.
ఈ నిర్ణయంతో గూటుపల్లి గ్రామ పరిధిలోని 142 సర్వే నంబర్లకు చెందిన వందలాది మంది రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లైంది. భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో రైతులు రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు, ఇతర భూ సంబంధిత లావాదేవీలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల విజ్ఞప్తులు, ప్రజాప్రతినిధుల ప్రయత్నాల మేరకు కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏర్పడిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ రైతులకు న్యాయం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
గూటుపల్లి గ్రామ రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ నిర్ణయం వెలువడటంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. రైతులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, గారికి, డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారికి , అలాగే ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి NMD Farooq గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గూటుపల్లి రైతుల చిరకాల సమస్యకు పరిష్కారం లభించడం పట్ల రైతులు "ఈ సహాయాన్ని ఎప్పటికీ మరచిపోలేం" అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Click here to claim your Sponsored Listing.